AP Politics: గత జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే చాలా పథకాలను రద్దు చేయడం జరిగింది. జగన్ అమలు చేసిన పథకాలను తాము అమలు చేయలేమని కూటమి ప్రభుత్వం తేల్చేసింది. ఖాజానాలో డబ్బుల్లేవని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. సూపర్ సిక్స్‌ను చూస్తుంటే భయం వేస్తోందని స్వయంగా సీఎం చెప్పడాన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతోంది కూటమి ప్రభుత్వం చేతుల ఎత్తెసిందని. ఉచిత బస్సు, సిలిండర్లు, తల్లికి వందనం, మహిళకు నెలకు రూ .1500 వంటి పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం సతమతం అవుతోంది.
అయితే జగన్‌కు మంచి పేరు తీసుకువచ్చిన వాటిని తీసేయాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను తీసేయం అని చెప్పి, ఇప్పుడు వారి ఊసే ఎత్తెడం లేదు. ఇక తాజాగా సచివాలయాలపై కూటమి ప్రభుత్వం కన్నుపడింది. ఏపీ ప్రభుత్వం తాజాగా వార్డు, గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా ఇంకా ప్రభుత్వ రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గత జగన్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు దగ్గర నుంచి , హెల్త్ కార్డు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పత్రాలు సచివాలయాలు దగ్గరే తీసుకునే విధంగా జగన్ ఏర్పాట్లు చేశారు. గతంలో ఎమ్‌ఆర్వో ఆఫీసుల చూట్టు కాళ్లు అరిగేలా తిరిగేవారు. వాటికి స్వస్థి చెబుతూ జగన్ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు సచివాలయాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. వాలంటీర్లు చేయాల్సిన పనులను కూడా సచివాలయ సిబ్బందితోనే చేయిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో , సచివాలయాలు ఉంటాయా లేదా అనుమానం కలుగుతోంది. పథకాలు అమలు చేయకుండా ఇలా జగన్ తీసుకువచ్చారనే కారణంతో ప్రజలకు ఉపయోగపడే వాటిపై చర్యలు తీసుకోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.