Sunday, October 13, 2024

CHANDRABABU: బాబు ప్లాన్ కొంప ముంచింది … జగన్ కి మోడీ పిలుపు .. NDAలోకి వైసీపీ ?

- Advertisement -

CHANDRABABU: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లాడ్డూ ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారని ప్రజల్లో వినిపిస్తున్న మాటలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఈ నాలుగు నెలల్లో తాను బురద రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు చాలా విసిగిపోయారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించి కలియుగ దైవంగా పూజించే సాక్ష్యాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే తన రాజకీయాల కోసం వాడుకోవటం అత్యంత దారుణమైన చర్య అని వారు చంద్రబాబు నాయుడు సర్కార్ పై నిప్పులు కురిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయా౦శమైంది.

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఇంత దారుణంగా మాట్లాడటం చాలా దుర్మార్గమని పైగా ల్యాబ్ రిపోర్టులతో ఆయన వ్యాఖ్యలకి సంబంధం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వదలడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భముగా జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో కోరారు.

తిరుమలకు నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారన్న వైఎస్ జగన్ టెండర్ల ప్రక్రియ తర్వాత ఎల్1 కాంట్రాక్టర్‌కు నెయ్యి సరఫరాను కేటాయిస్తారని చెప్పారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి శాంపిళ్లను తీసుకుని మూడుసార్లు పరీక్షిస్తారని చెప్పారు. మూడు టెస్టుల్లోనూ పాసైతేనే ఆ ట్యాంకర్‌ను టీటీడీ అనుమతిస్తుందని గుర్తుచేశారు. జులై 12న ట్యాంకర్లలోని నెయ్యి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకున్నారన్న వైఎస్ జగన్ జులై 17న పరీక్షల కోసం NDDBకి పంపారన్నారు. ఎన్‌డీడీబీ నుంచి జులై 23న రిపోర్టు వచ్చిందనీ, అయితే రెండు నెలల కిందటే నివేదిక వస్తే ఇన్ని రోజులు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ కూటమి వందరోజుల పాలన గురించి, సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ నేపధ్యంలో జగన్ రాసిన లేఖ విషయమై చర్చించేందుకు జగన్ కి మోడీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ప్రజల్లో జగన్ ని విలన్ చేయాలనుకున్న చంద్రబాబు ప్లాన్ ఫెయిల్ అయిందని త్వరలోనే ఆయన కొంప ముంచనుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయ పడ్డారు. చూస్తుంటే టీడీపీ ని కాదనుకొని ఎన్డీయే లోకి వైసీపీని తీసుకునే అవకాశం లేకపోలేదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!