Thursday, October 3, 2024

Chandrababu: CM అయిన ఆనందం కూడా లేకుండా చంద్రబాబు కి నిద్ర పట్టని బ్యాడ్ న్యూస్!!

- Advertisement -

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు వణికిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. లేకపోతే ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని ఇచ్చిన హామీ మీద కోర్టుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేసి రాజకీయ వేడిని రగిల్చారు. దాంతో కార్మికులు దీక్ష చేస్తున్న శిబిరానికి గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాసరావు వెళ్లి అక్కడి కార్మికులకి ఆయన సంఘీభావం ప్రకటించారు.

ఎన్నికల ముందు విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించకుండా చూసుకునే బాధ్యత తమదని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన కార్మిక సంఘానికి తెలిపారు. విశాఖ ఉక్కుని రక్షించుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తాను అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుని కాపాడేందుకు తాము తుది వరకూ ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే టీడీపీ ఎంపీ శ్రీ భరత్ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డు పడతామని అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ కార్మికల పక్షానే ఉండి పోరాడుతామని ఆయన చెప్పారు.

అయితే ఉక్కు కార్మిక లోకం ఈ మాటలను పక్కన పెడుతోంది. విశాఖ ఉక్కు మూసివేతకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందని అందువల్ల చంద్రబాబు నాయకత్వంలో వెంటనే అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుని వెళ్ళి ఉక్కు మీద బలమైన హామీని పొందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాటలతో కాలం గడిపేందుకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు అని వారు అంటున్నారు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప ఉక్కు బతికి బట్ట కట్టదని వారు స్పష్టం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విశాఖ ఉక్కుకి ముడి సరకు నిలుపుదల చేయడం ద్వారా ఇబ్బంది పెడుతున్నారని ఇది ప్లాంట్ మూతకే దారి తీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటికి వస్తామని అయినా సరే ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించకుండా కూటమి ప్రభుత్వమే కాపాడాలని వారు సూచిస్తున్నారు.

మొత్తానికి విశాఖ ఉక్కు సమస్య టీడీపీ గొంతు మీద కత్తి పెట్టినట్లు అయింది. ముందు చూస్తే నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. కేంద్రం అయితే ప్రైవేటీకరణకు డిసైడ్ అయిపోయింది అని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కేంద్రానికి నచ్చచెప్పినట్లు అయితేనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒడ్డున పడుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో రివర్స్ లో ఏమైనా జరిగితే అది టీడీపీకే అతి పెద్ద సమస్య అవుతుందని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే సీఎం అయిన ఆనందం కూడా లేకుండా చంద్రబాబుకి నిద్ర పట్టని బ్యాడ్ న్యూస్ అని ప్రతిపక్ష వర్గాల్లో నడుస్తున్న చర్చ.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!