Wednesday, October 16, 2024

జేసీకి బిగ్ షాక్..జగన్ కాపాడేనా..?

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేసీ కుటుంబానికి చాలానే కష్టాలు ఎదురైయ్యాయి. జగన్‌ను తట్టుకోవడం జేసీ కుటుంబం వల్ల కావడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్దానం ప్రారంభించిన జేసీ కుటుంబం రాష్ట్ర విభజన తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో టీడీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జేసీ సోదరులు ఎంపీగా , ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో వీరు ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేసింది జేసీ కుటుంబం. జగన్‌ను అమ్మ నా బూతులు కూడా తిట్టారు జేసీ సోదరులు. చేసిన పాపం ఎక్కడికి పోతుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

టీడీపీ తరుఫున పోటీ చేసిన జేసీ కుటుంబం ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి జేసీ ఫ్యామిలీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అక్రమంగా చేస్తున్న వారి వ్యాపారాలపై దాడులు చేసి వాటిని సీజ్ చేసింది వైసీపీ సర్కార్. ఇక పర్మిట్ లేని బస్సులను నడుపుతున్నారని బయటపడటంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడును కూడా జైలుకు పంపించడం జరిగింది. పోలీస్ కేసులు, మైనింగ్ క్వారీలు సీజ్, ట్రావెల్స్ సీజ్ వంటి వివాదాలతో జేసీ కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై సోదాలు నిర్వహించారు . జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎటాచ్ చేసింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులుపేర్కొన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం ఎటాచ్ చేసింది. సుమారు 22 కోట్లకు పైగానే విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించింది. రూ.38.36 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించామన్న ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ అధికారుల దాడిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. తాము 38 కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారని, వాస్తవాలన్నీ తర్వాత వెలుగులోకి వస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో ఆర్టీవోతో పాటు పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని ఆయన అన్నారు. తమకు వాహనాలను అమ్మిన ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ ను విచారించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!