Tuesday, October 8, 2024

AP Politics: తిరుమల లడ్డూ రిపోర్టుల బిగ్ ట్విస్ట్..అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

- Advertisement -

AP Politics: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న దుమారం తగ్గట్లేదు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటాగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది.

జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందంటూ టీడీపీ ఆరోపిస్తుండగా, వైసీపీ వాటిని తోసిపుచ్చుతోంది. రాజకీయ ప్రతీకారంగా తిప్పికొడుతోంది.టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ స్పష్టం చేశారు. తేదీలతో సహా వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్స్‌గా అభివర్ణించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ సైతం మాజీ సీఎం జగన్ లేఖ రాయడం జరిగింది.

నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల అవశేషాలు కలిగి ఉన్నాయంటూ ఐఎస్ఓ ఎన్డీడీబీ ఈ రిపోర్ట్ ఇచ్చింది.అదే సమయంలో ఈ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ తమ ఘీ టెస్టింగ్ నివేదికలనూ వెల్లడించింది.తిరుమలకు ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యి కల్తీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి ఆయా రిపోర్టులన్నీ. టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెయ్యి ఉందని తేటతెల్లం చేశాయి. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నెయ్యి నివేదికల టైమ్ లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే..అందులో పొందుపరిచిన తేదీలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. టీటీడీకి చెందిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ వరుసగా ఈ ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నెయ్యి శాంపిల్స్‌ను సేకరించింది. అదేవిధంగా- ఏఆర్ డెయిరీ తమ నెయ్యి శాంపిళ్లను జూన్ 2, జూలై 8వ తేదీల మధ్య టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్‌లకు అయిదుసార్లు పంపింది. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలను టీటీడీ అధికారులకు ఏఆర్ డెయిరీ సమర్పించింది.

ఈ వ్యవహారం మొత్తం కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే చోటు చేసుకోవడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఈ ఏడాది జూన్ 4వ తేదీన వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు అదే నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 16వ తేదీన టీటీడీ కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఎస్ఎస్ అధికారి జే శ్యామలరావును నియమించారు చంద్రబాబు. ఎస్ఎంఎస్ ల్యాబ్‌, టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ నిర్వహించిన కొన్ని పరీక్షలు కొత్త ఈవో నియామకం తరువాతే టీటీడీకి అందాయి.మొదటి రౌండ్ నమూనాలను జూలై 9వ తేదీన సేకరించారు. ఆ తరువాత అదే నెల 17వ తేదీన రెండో రౌండ్ శాంపిల్స్‌ను సేకరించారు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది నివేదిక అదే నెల 23వ తేదీన టీటీడీకి అందింది.

ఈ నెయ్యి మంచి వాసన, రుచిని కలిగివుందంటూ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అదే సమయంలో జూలై 23వ తేదీన ఎన్డీడీబీ ఇచ్చిన తుది నివేదిక మాత్రం దీనికి భిన్నంగా జారీ అయింది. కల్తీ జరిగిందంటూ పేర్కొన్నాయి. శాంపిల్స్ సేకరించే ప్రక్రియలో గానీ, పాలను సేకరించిన ఆవు హార్మోన్లల్లో హెచ్చుతగ్గుల వల్ల గానీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ సోదరి గవర్నర్‌ను కలిశారు. వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడం వల్లే టీడీపీ ఇలా కుట్ర పన్నిందని స్పష్టం అవతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!