Sunday, October 13, 2024

Bigg Boss 8 : చీఫ్ సెలక్షన్ సభ్యుల ఎంపిక.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా సోనియా, యష్మీ జోడీ

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు వారాలు గడిచాయి. నాలుగో వారం మొదలైంది.. నాలుగో వారం తొలి రెండు రోజుల్లో నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్ లో షోని హీటెక్కించ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నాలుగో వారానికి సంబంధించి చీఫ్ సెలక్షన్ కూడా జరిగింది. ఇక నాలుగో వారం విషయానికొస్తే.. నిఖిల్ హౌస్ చీఫ్‌గా కొనసాగుతుండగా.. మరో క్లాన్ కు చెందిన చీఫ్ అభయ్ వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కిర్రాక్ సీతను చీఫ్‌గా ఎంచుకున్నారు. వారు తమకు నచ్చిన క్లాన్ లోకి వెళ్లారు. సీత, నిఖిల్ ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతూ క్లాన్ లోకి వెళ్లారు. చివర్లో, సీత క్లాన్ లోకి వెళుతున్నానని, స్పోర్టివ్‌గా గేమ్ ఆడటానికి ఇంట్లోకి వచ్చానని యష్మీ చెప్పింది. ఇక అక్కడ ప్రోమో ముగియడంతో ఇక ఏం జరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రోమో విషయానికొస్తే.. కాంతారా వంశానికి చెందిన అభయ్ నవీన్ మూడో వారంలో ఎలిమినేట్ అవ్వగా, నాలుగో వారంలో సీత ఆ క్లాన్ కు చీఫ్ గా కధానాయికగా ఎంపికైంది. బిగ్ బాస్ మాట్లాడుతూ.. సీతా కాంతారా క్లాన్ కు చీఫ్ గా ఎన్నికయ్యారు. కాబట్టి కాంతారా చీఫ్ హారాన్ని ధరించి బెంచీ మీద కూర్చో అన్నారు. సీత చీఫ్ గా ఎన్నికైన త‌ర్వాత కుటుంబ స‌భ్యులుగా ఉన్న మీరే.. మ‌ళ్లీ మీ క్లాన్ ను ఎంచుకునే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. దీంతో తొలుత విష్ణు ప్రియ ముందుకు రావడంతో శక్తి క్లాన్ లో నాకు గుర్తింపు కనిపించలేదు. నేను సీతతో ఉండాలనుకుంటున్నాను అందుకే కాంతారా క్లాన్ కు వెళ్తున్నాను అని చెప్పింది.

ఆ తర్వాత సోనియా, నిఖిల్‌లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. కాంతారా క్లాన్ తో పోలిస్తే.. చీఫ్ గా నిఖిల్ బెస్ట్ అనిపించుకున్నాడు అందుకే అక్కడికి వెళ్తున్నానని చెప్పింది. యష్మీ ఇచ్చిన లుక్ ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. అనంతరం నైనిక మాట్లాడుతూ.. సీతను చీఫ్‌గా నమ్ముతాను. శక్తి క్లాన్ కి ఇప్పటికే బలం ఉంది. అక్కడ కొన్నిసార్లు ఆడడానికి ముందుకు రాలేదు. అందుకే సీత క్లాన్ లోకి వెళ్లి తన ప్రతిభను నిరూపించుకుంటానని చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లిపోయాడు. నబీల్ , ఆదిత్య సీత క్లాన్ కు వెళ్ళగా, మణికంఠ నిఖిల్ క్లాన్ కి వెళ్ళాడు. యష్మీ నేను ఎమోషనల్ బాండ్ కోసం ఈ ఇంటికి రాలేదు. నేను గేమ్ ఆడటానికి వచ్చాను. కాంతారా ప్రతి ఒక్కరూ స్పోర్టీవ్ గా ఆడతారన్న నమ్మకంతో అక్కడికి వెళ్తున్నట్లు తెలిపింది. దీంతో ఒక్క నిమిషం పాటు బిగ్ బాస్ అంటూ ప్రేరణ ఉత్కంఠ రేపింది. దీంతో ప్రోమో కాస్త ముగిసింది. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!