Tuesday, October 8, 2024

Chandrababu: తెల్లారితే టీవీలకెక్కి జగన్ మీద పడే జీవీ రెడ్డికి బిగ్ షాకిచ్చిన చంద్రబాబు..?!

- Advertisement -

Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డికి సొంత పార్టీలోనే కొందరు పొగ పెట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడలేదు. టీడీపీ అనుకూల ఛానళ్లలో కూర్చొని జీవీ రెడ్డి మోతాదుకు మించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో చప్పట్లు కొట్టారు మరియు శభాష్ అంటూ జీవీ రెడ్డిని అభినందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, జీవీ రెడ్డికి పెద్దపీట వేస్తారని అంతా అనుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటి విడతలో 20 కార్పొరేషన్లను భర్తీ చేస్తే, అందులో జీవీ రెడ్డికి చోటు లేదు. ఇది ఆయన్ను ఎంతో బాధించిందని ఆయన అనుచరులు తెలిపారు. దీంతో తన ఆస్థాన మీడియా వేదికగా ఆయన ఆవేదన వెల్లగక్కారు. మొదటి విడతలో తమకు చోటు దక్కకపోతే, ఏం విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అలాగే చంద్రబాబునాయుడి పర్సనల్ సెక్రటరీ కప్పర్థి తీరుతో ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడి హెచ్చరిక చర్చనీయాంశమైంది. జీవీ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు హెచ్చరించారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాగైతే వేటు వేస్తామని బాబు తనదైన స్టైల్లో జీవీ రెడ్డికి హెచ్చరిక పంపారనే సంకేతాలు వెళ్లాయని టీడీపీ నేతలే చెబుతున్నారు. పదవులు చాలా ఉన్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని ఆయన హెచ్చరించారట. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడి నోరు జారుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదనీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని అది గుర్తు పెట్టుకోవాలని బాబు అన్నారట. టీడీపీ, చంద్రబాబునాయుడి శ్రేయోభిలాషిగా తాను మాట్లాడానని జీవీ రెడ్డి చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా భావించడం లేదు. జీవీ కామెంట్స్ ను క్రమశిక్షణ ఉల్లంఘన కింద టీడీపీ అధిష్టానం భావిస్తోందని కొందరు టీడీపీ నాయకులు తెలిపారు. అందుకే జీవీ కామెంట్స్ ని అదే పనిగా చంద్రబాబు వద్దకు మోసుకెళ్లారు. జీవీ మనసేంటో తెలిసిన తర్వాత, ఇక ఆయనకు రానున్న రోజుల్లో ఏ మాత్రం ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి. రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే కొన్ని సార్లు సొంత పార్టీ నాయకులతోనే ఎక్కువ నష్టం ఉంటుందని జీవీ రెడ్డితో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారట. తెల్లారితే టీవీలకెక్కి జగన్ మీద పడే జీవీ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాకిచ్చారని తమ పార్టీ పట్ల అనవసరమైన విమర్శలు చేసినందుకు గాను జీవీ రెడ్డికి తగిన శాస్తి జరగనుందని వైసీపీశ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!