లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి..! అంటూ బతిమాలుకుంటున్న చంద్రబాబును ప్రజల నమ్ముతారా..? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉండి ఏం చేశారని ఇప్పుడు కొత్తగా ఛాన్స్ అడుగుతున్నారంటూ.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతకు లాస్ట్ ఛాన్స్ అనేది ఉండదు. గెలిస్తే అధికారం.. లేకుంటే ప్రతిపక్షం. మాటలతో మాయచేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇదేం కొత్త కాదు. ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉన్నారో.. దాదాపు అదే సమయం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఎప్పుడూ లేని ఈ ఎమోషనల్ డైలాగ్ ఆయన నోటి నుంచి వచ్చిందంటే సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వాయిస్: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు ఒక్కడే అంతా తానై నెట్టుకొస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఉనికి కరువైంది. మరి ఏపీలోనూ ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చేసేది లేక చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటూ.. కొత్తరాగం అందుకున్నారు. మొన్నటి వరకూ పవన్ తనకు తొడు వస్తాడని అనుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ భేటీ జరగడం, బీజేపీ నుంచి తనకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో చంద్రబాబు డీలా పడ్డారు. అందుకే ఇలాంటి డైలాగులతో ప్రజల్లో సానుభూతి సంపాదించే పనిలో పడ్డారు. రాజకీయాల్లో లాస్ట్ అనేది ఎవరికి ఉండదు. ఐదేళ్లకొకసారి ప్రజలు ఇచ్చే తీర్పుపైనే ఛాన్స్ ఆధారపడి ఉంటుంది.
వాయిస్: చంద్రబాబు చెప్పిన లాజిక్ ప్రకారం 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. మళ్లీ పోటీ చేయకూడదు. కానీ చంద్రబాబు గెలిస్తే మాత్రం మళ్లీ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారు. మరి అప్పుడు లాస్ట్ ఛాన్స్ ఎలా అవుతుంది. కేవలం అధికారంలోకి రావడానికి ఎమోషనల్ గా ప్రజలను తన వైపునకు తిప్పుకోవడానికే లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ను వదిలారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ మాటను ఊరికే అన్నారని అనుకోవడానికి కూడా ఆయన ఆషామాషీ నేత కాదు. చంద్రబాబుకు అనుకోకుండా వచ్చిన మాట కాదు. పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ అన్న తర్వాతనే చంద్రబాబు నోటి నుంచి ఈ డైలాగు వచ్చిందంటే ఆయన వచ్చే ఎన్నికల్లో తాను వామపక్షాలతో కలసి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారనే అనుకోవాలి.
వాయిస్: అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ పనిచేస్తుందా..? అంటే కాదనే చెప్పలేం. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన తర్వాత సెంటిమెంట్ తో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆయన చేతికి కట్టుతో ప్రజల ముందుకు వచ్చి సానుభూతి కోసం ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం ఆయనను ప్రజలు ఆదరించలేదు. అదే సమయంలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చేరదీశారు. అంతే తప్ప చంద్రబాబుపై హత్యాయత్నం జరగడాన్ని ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు పాలను ప్రజలు ఛీకొట్టారు.
వాయిస్: అలాగే వైఎస్.జగన్ ను కూడా 2014 ఎన్నికలకు ముందు 16 నెలలు జైల్లో పెట్టినా, జగన్ పై అక్రమ కేసులు బనాయించారని జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఊరూరా తిరిగినా ప్రజలు అక్కున చేర్చుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వంగి వంగి నమాస్కారాలు పెట్టారు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాలలో తానే అభ్యర్థినని, తనను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోదీపై ధర్మ పోరాటం చేస్తున్నట్లు ఫుల్ కవరేజ్ ఇచ్చుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లో మాత్రం ఎలాంటి సెంటిమెంట్ ను ప్రజలు పట్టించుకోలేదన్నది యదార్థం. ఇప్పుడు కూడా లాస్ట్ ఛాన్స్ అన్న ఎమోషనల్ సెంటిమెంట్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారన్నది ప్రశ్నగానే ఉంది. లాస్ట్ ఛాన్స్ పేరుతో మళ్లీ అధికారంలోకి వచ్చి.. ఈసారి మళ్లీ కొడుకు లోకేష్ ను దొడ్డిదారిన ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోబెడతారని టీడీపీ నేతలు చేవులు కొరుక్కుంటున్నారు..