Thursday, October 3, 2024

Tirumala Laddu : మొత్తం FAKE REPORT? అడ్డం గా దొరికారు?

- Advertisement -

Tirumala Laddu : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంద రోజుల పాలనలో ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారని, దీన్ని కప్పి పుచ్చుకునే క్రమంతో తన మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుమల ప్రసాదంపై పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వంద రోజుల్లో ఏఏ సందర్భాల్లో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేశారో జగన్ వివరాలు వెల్లడించారు. బాబు సర్కార్ అరాచక పాలనకు వ్యతిరేకంగా తాము ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తే, దాన్ని పక్కదారి పట్టించేందుకు మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయని హెలికాప్టర్ పంపారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోరుముద్ద, గురుకుల పాఠశాలల్లోనూ, ట్రిపుల్ ఐఐటీల్లోనూ ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు ఇబ్బంది పడుతుంటే, చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు గడిచాయంటూ వేడుక నిర్వహించారన్నారు.

విజయవాడలో వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విజయవాడ, ఏలేరులో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ క్రియేట్ చేసి వరదలు ముంచెత్తడంతో దాన్నుంచి డైవర్షన్ కోసం బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశామంటూ ఆరోపణలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నం స్కామ్లపై ఆందోళన జరుగుతుంటే వాటి నుంచి డైవర్షన్ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను సస్పెండ్ చేశారని జగన్ చెప్పుకొచ్చారు. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు హామీలిచ్చిన సూపర్ సిక్స్ తదితర సంక్షేమ పథకాలు గుర్తుకొచ్చి జనాలు ఆగ్రహిస్తున్నారని దాని నుంచి పక్కదారి పట్టించడంలో పరాకాష్టగా తిరుమల ప్రసాదంపై చంద్రబాబు ఇష్టానుసారం నిందలు వేశారని జగన్ మండిపడ్డారు. తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపించడం దారుణమన్నారు.

రాజకీయాల కోసం చివరికి దేవున్ని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన చేసే దుర్మార్గమైన మనస్తత్వం కేవలం చంద్రబాబుకి మాత్రమే ఉంటుందని జగన్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు. తిరుమలలో నెయ్యి సేకరణ ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిస్తే కంపెనీలు కోట్ చేస్తాయన్నారు. వాటిలో ఎల్-1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుందని తెలిపారు. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం అని గుర్తు చేసిన వైయస్ జగన్, కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, వారు ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారని.. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రీడియంట్స్ను కానీ, నెయ్యిని కానీ అనుమతించి, టీటీడీ ప్రసాదంలో వాడతారని చెప్పారు.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారో చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే.. అదే రోజు టీటీడీకి ఒక ట్యాంకర్ వస్తే.. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారన్నారు. మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారని తెలిపారు. రెండు నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్సక్స్ గురించి ప్రజలు నిలదీస్తారన్న భయంతో, వారి దృష్టి మళ్లించేందుకు రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి గుడిని అపవిత్రం చేస్తూ.. అక్కడ ప్రసాదం తయారు చేసే ప్రక్రియను అభాసు పాల్టేస్తున్నారని ఆవేదన చెందారు. అంటే మన గుడిని, మన వెంకటేశ్వరస్వామిని మనం తగ్గించుకుంటున్నామన్నారు. అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తామని ఏ తప్పూ జరగకపోయినా జరిగినట్టు చూపించి మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రతిష్టను బజారుకు ఈడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలని జగన్ విన్నవించారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!