Tuesday, October 8, 2024

TTD: టీటీడీ ఆస్తులు చంద్రబాబు అమ్ముతుంటే అడ్డుపడిందే జగనే.. సంచలన విషయాలు వెలుగులోకి

- Advertisement -

TTD: తిరుమల లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటాగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు.

దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారికి చెందిన ఆస్తులు అమ్మకుండా శాశ్వత నిర్ణయం తీసుకున్నారు జగన్. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు అమ్మడం జరుగుతుండేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి ముగింపు పలికారు. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకరమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించారు జగన్.

2014 టీడీపీ ప్రభుత్వ హయంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై సమీక్ష నిర్వహించిన జగన్.. దేవస్థానం ఆస్తుల అమ్మకాన్ని ఆపేయాలని కోరారు. అంతే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తులు అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేస్తూ అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది.

జగన్‌ నిర్ణయం మేరకు భక్తులు కానుకల ద్వారా ఇచ్చిన ఆస్తులు ఉపయోగకరంగా లేకపోయినప్పటికీ వాటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉపయోగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి స్వామీజీలు, మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతూ వచ్చింది. జగన్ పాలనలో టీటీడీ పారదర్శకంగా ఉందనడానికి ఇంత కన్నా రుజువు ఇంకేం కావాలంటూ వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఇదింతా చేస్తున్నారని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!