Tuesday, October 8, 2024

Jagan-Balineni: జగన్ సార్.. డోర్ తీయండి.. వెనక్కి వస్తా అని బాలినేని రిక్వెస్ట్..?!

- Advertisement -

Jagan-Balineni: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరనున్నారు. అయితే తొలుత బలప్రదర్శన చేసి, అనుచరగణంతో ఘనంగా పార్టీలో చేరాలని బాలినేని భావించినా అందుకు జనసేన అధిష్ఠానం నిరాకరించింది. ర్యాలీకి అనుమతి కోరినా సరే ప్రయోజనం లేకపోయింది. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి మార్పు లేకపోవడంతో బాలినేని ఇక మెట్టు దిగక తప్పలేదు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు.

మొదట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌‌ను ఒంగోలుకు రప్పించి తన బలప్రదర్శన నిర్వహించి అనుచరగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు. అయితే బాలినేని చేరికను కూటమి నేతలు మరియు ఒంగోలు స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ బాలినేనిపై మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరని బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మండిపడ్డారు. దీంతో బాలినేనిని సైలెంట్‌గా పార్టీలో చేర్చుకోవాలని పవన్ కల్యాణ్ భావించారు. ఒంగోలులో సభ అవసరం లేదనీ ఒక్కరే మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరాలని బాలినేనికి జనసేన అధిష్ఠానం కబురుపంపింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్‌ కూడా పార్టీలో చేరతారని ప్రకటించింది.

దీంతో మాజీ మంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదన్నది స్పష్టమైంది. దీనికి అనుగుణంగానే ఆయనన ఒక్కరినే పార్టీలోకి రావాలని కోరడం జరిగింది. ఊహించని పరిణామంతో మాజీ మంత్రి శిబిరం డీలా పడింది. ఒకానొక దశలో చేరిక వాయిదా పడిందన్న ప్రచారమూ సాగింది. కినుక వహించినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో బాలినేని మెట్టు దిగక తప్పలేదు. తాను చేరాక మిగతా వారినీ పవన్‌ కల్యాణ్‌ సమక్షంలోనే పార్టీలో చేరుస్తానని క్యాడర్‌తో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. బాలినేనితో పాటు ఈ రోజు వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరనున్నారు. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య ఇవాళ జనసేనలో చేరుతున్నారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పనున్నారు. పార్టీలో ఇంకా చేరక ముందే ఇలాంటి సంఘటన జరగడంతో తనకి గౌరవం ఇవ్వడం లేదని, ఒంగోలులో సభ నిర్వహించి పార్టీలో చేరనున్నట్లు మీడియా ముందు తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక పోతున్నందుకు ఆయన బాధ పడుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. జగన్ సార్ డోర్ తెరవండి మళ్ళీ మీ పార్టీలోకే వస్తానని ఆయన వైసీపీ అధినేత జగన్ ని రిక్వెస్ట్ చేసినట్లు తెర వెనుక సమాచార౦. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!