Friday, April 19, 2024

టీడీపీ కంచుకోటపై జగన్ కన్ను.. ఈసారి కొడితే కుంభస్థలం బద్దలవ్వాల్సిందే

- Advertisement -

వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి అటు రాజకీయాలను ఇటు ప్రభుత్వ పాలనను సమన్యాయంగా చేసుకుంటు ముందుకు పోతున్నారు. ఇటు ప్రజలకు సుపరిపాలనను అందిస్తునే … మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు కూడా చక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత అయిన చంద్రబాబకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు జగన్. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుకు పార్టీ నాయకులు సైతం హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీని పలువురు నాయకులు వీడారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక టీడీపీకి గుడ్ బై చెప్పారు.

ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయ్యారు కావడం ఖాయం అని ఆ పార్టీ నాయకులే చెప్పడం విశేషం. తాజాగా టీడీపీకి మరో షాక్ ఇవ్వాడానికి రెడీ అయ్యారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ కీలక స్థానాల్లో గెలుపే ధ్యేయంగా పెట్టుకున్నారాయన. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో టీడీపీ చాలా బలంగా ఉండేది. కాని జగన్ వైసీపీ స్థాపించిన తరువాత ఉత్తరాంధ్ర కూడా ఆ పార్టీ టీడీపీతో సమానంగా స్థానాలను గెలుచుకుంటుంది.

కాని 2019లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పూర్తిగా జగన్ పార్టీ డామినేషన్ కనిపించింది. జగన్ హవా ముందు ఇక్కడ కూడా టీడీపీ నిలవలేకపోయింది. గత ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి స్థానాల్లోనే గెలవగలిగింది. ఈసారి ఎన్నికల్లో ఇప్పుడు గెలుచుకున్నవాటితోపాటు ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించాలని నాయకులందరికీ జగన్ ఖరాఖండిగా చెప్పేశారని తెలుస్తోంది. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థుతుల్లో అచ్చెన్నాయుడు విజయం సాధించడానికి వీల్లేదని నాయకులకు దిశా నిర్ధేశం చేశారట. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద పోటీకి దువ్వాడ శ్రీనివాస్‌ను రంగంలోకి దించుతున్నారు.

ఇప్పటికే ఆయనకు టిక్కెట్ ఖారారు చేస్తూ…దువ్వాడ శ్రీనివాస్‌కు కావాల్సిన అండదండలు పుష్కలంగా అందిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఆయన్ను కూడా ఓడించడానికి జగన్ కీలక ప్రణళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు మీద ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించుతున్నట్లుగా సమాచారం అందుతుంది. రామ్మోహన్ నాయుడుపై వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ అయిన కిల్లి కృపారాణిని రంగంలోకి దించాలని జగన్ యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈసారి ఎలాగైనా టెక్కలిలో అచ్చెన్నాయుడును, ఇటు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడును ఓడించడానికి గట్టిగానే జగన్ ఫిక్స్ అయినట్లుగా కనబడుతుంది. మరి జగన్ వ్యూహాలను అటు అచ్చెన్నాయుడు.. ఇటు రామ్మోహన్ నాయుడు ఎలా తట్టుకుంటారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!