LOKESH : తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరింత ముదురుతోంది. ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను టీడీపీ సమర్థిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ లడ్డూ వివాదంపై ట్వీట్ చేశారు. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని, చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్ ద్వారా తెలిపారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి అసలు వాడనేలేదని లోకేష్ ట్వీట్ చేయడం గమనార్హం. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి ప్రసాదం తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఆయన తనయుడు అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. ఇదంతా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కుట్ర అని బట్టబయలు కావడంతో పాటు తాను చేసిన ట్వీట్‌తో లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు అని వైసీపీ అంటోంది.
జగన్ కమీషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడన్న లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తిప్పికొట్టాయి. ఇదంతా దుష్ప్రచారమే అయినప్పటికీ తమని తాము సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న రాద్ధాంతంతో ప్రజలకు అర్ధమయ్యే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ అబద్దపు, అవాస్తవపు వ్యాఖ్యలు అని నారా లోకేష్ ట్వీట్ తెలియజేస్తుందని మనం గమనించాలి. జులై 6, 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంకులు వచ్చినట్లు తెలుపుతూ.. అసలు ఆ నెయ్యిని టెస్టులకు వాడలేదని చేసిన లోకేష్ ట్వీట్ చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా ఉంది. దీంతో శ్రీవారి లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసినవన్నీ అవాస్తపు ఆరోపణలు అని స్పష్టంగా అర్థమవుతోంది.