Sunday, October 13, 2024

Lokesh:లోకేష్ ని CM చేయడానికే లడ్డూ పాలిటిక్స్ ?

- Advertisement -

Lokesh: తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్ తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్ ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు.

తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రిపోర్టులు సైతం చెబుతున్నాయని నారా లోకేష్ అన్నారు. తామేమీ నిరాధార ఆరోపణలు చేయలేదని సాక్ష్యాలను ప్రజల ముందు ఉంచినట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు లోకేష్. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీబీఐ విచారణ మీద సీఎం త్వరలోనే ప్రకటన ఇస్తారని అన్నారు. అయితే సీబీఐ విచారణతోనే ఆగిపోమన్న లోకేష్ కారకులను శిక్షించి, తిరుమలను ప్రక్షాళన చేస్తామన్నారు.

ఈవీఎంల టాంపరింగ్, విజయవాడ వరద బాధితుల ఆవేదన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, మెడికల్ కాలేజీల ఇష్యూ, ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ మరియు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని చంద్రబాబు అమలు చేయలేకపోవడం ఇలాంటి కారణాల రీత్యానే తిరుమల రెండు నెలల క్రితం వచ్చిన ల్యాబ్ రిపోర్టుని చంద్రబాబు బయటికి తెచ్చారని పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జరగబోయే ఐదేళ్లు హెరిటేజ్ నెయ్యి ఎక్కువ ధరకు అంటగట్టడానికి, మరియు జగన్ ని కులరాజకీయాల తో అంతం చేయడానికి దేశం లోని అత్యున్నత వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయన వాపోయారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి హిందువులను హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత ఘర్షణలు చంద్రబాబు సృష్టించాలనుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసిందంతా మోసమే అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనమే అన్నారు.

జులై 12న ట్యాంకర్లలోని నెయ్యి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకున్నారనీ, జులై 17న పరీక్షల కోసం NDDBకి పంపారన్నారు. ఎన్‌డీడీబీ నుంచి జులై 23న అంటే రెండు నెలల కిందటే నివేదిక వస్తే ఇన్ని రోజులు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ కూటమి వంద రోజుల పాలన గురించి, సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల నుంచి జనాలని దూరం చేయాలని తద్వారా లోకేష్ సీఎం అయ్యేందుకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని చంద్రబాబు భావిస్తున్నారని అందుకే ఇలా లడ్డూ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!