Tuesday, October 8, 2024

AP POLITICS: వైసీపీపై అభిమానం.. బీజేపీ నేతలకు చెక్

- Advertisement -

AP POLITICS: భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ కూడా వైఎస్సార్సీపీ అంటే అభిమానం చూపించే నేతలు కొందరు ఉన్నారు. అలాంటి వైసీపీ అభిమానులకు పదవులు దక్కకుండా వారిని ఆ పార్టీలో చిన్నచూపు చూస్తున్నారనే మాట వాస్తవం. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక.. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నేతలు బీజేపీలో ఉంటూనే వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. పేరుకు బీజేపీలో ఉన్నా సరే.. వాళ్లు వైసీపీకి వీరాభిమానులు. ఇదంతా పక్కన పెడితే.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనతో పొత్తుగా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో ఉన్న బీజేపీ నేతల్లో కొందరు కీలక నేతలు వైసీపీ అధినేత జగన్‌కు, వైసీపీకి మద్దతుగా ఉన్నారన్న విషయం తెలుసా?

వారిలో ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి ప్రముఖ నేతలు పదవులపై ఆశ‌లు పెట్టుకున్నప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి ప్రోత్సహం కనిపించడం లేదు. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ నుంచి లంక దినకర్‌కు మాత్రమే అవకాశం దక్కింది. ఒక రకంగా ఆయన మాజీ టీడీపీ నేత అనేది ఇక్కడ మనం గమనించాలి. అదే సమయంలో వైసీపీ కోవర్టులుగా టీడీపీ భావిస్తున్న కొందరు నేతలకు కూటమి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. అయితే.. సోము వీర్రాజు, జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి వంటి బడా నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఇదంతా వైసీపీకి సానుభూతిపరులు అనే ఒకే ఒక్క కారణంతో టీడీపీ ఇలా వ్యవహరిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ మీద అక్కసుతో పైన చెప్పుకున్న నేతలకు టీడీపీ పక్కన పెడితే.. వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వారు రాజకీయాల్లో ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతూ టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!