Tuesday, March 19, 2024

కీలక నిర్ణయం దిశగా ముద్రగడ పద్మనాభం.. రాజకీయాల్లోకి రీఎంట్రీ.. మూహార్తం ఫిక్స్…?

- Advertisement -

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. 2019 ఎన్నికల ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభం క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని టీడీపీ అధినేత చెప్పడంతో..ఆ ఎన్నికల్లో కాపులందరు కూడా టీడీపీకి అండగా నిలబడ్డారు. దీనికి పవన్ మ్యానియా కూడా తోడు కావడంతో… 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాగలిగారు.కాని కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో చంద్రబాబు ఫెయిల్ కావడంతో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపారు. కాపులందరిని ఏకం చేసే ప్రయత్నం చేశారాయనర.

దీనిపై ఓ భారీ బహిరంగ సభను కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున కాపులు హాజరు కావడం.. ఈ సభపై టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. అయితే ఈ సభలో కొన్ని ఆరాచక శక్తులు గందరగోళాన్ని సృష్టించాయి. రైలు రోకో చేద్దామని ముద్రగడ పద్మనాభం పిలుపునిస్తే… కొందరు ఆరాచక శక్తులు ఏకంగా రైలును తగులబెట్టడంతో విషయం చాలా సీరియస్‌గా మారింది. ఇక అప్పటి నుంచి కాపు ఉద్యమాన్ని అణగతొక్కే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా హోస్ అరెస్ట్ చేయించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాపులు మీటింగ్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అతి దారుణంగా హింసించారు. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో ముద్రగడ పద్మనాభం ఇంటి ఆడవారిని దూషించారు టీడీపీ నాయకులు. ఇక ముద్రగడ పద్మనాభం తనయుడును అయితే పోలీసులు ఎంతలా కొట్టారో.. మనం వీడియోల్లో కూడా చూశాం. కాపులకు మొండి చేయి చూపించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం పోరాడుతునే ఉన్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి కూడా చంద్రబాబు పతనం కోసమే తాను ఇంకా జీవించి ఉన్నానని తెలిపారాయన.

వచ్చే ఎన్నికల నాటికి ముద్రగడ పద్మనాభంను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో ముద్రగడ పద్మనాభంకు ఉన్నంత విలువ మరెవ్వరికి లేదంటే అతిశేయోక్తి కాదు. ముద్రగడను కాపు సామాజికవర్గం తమ నేతగా ఓన్ చేసుకుంటుంది. ఆయనను సొంతం చేసుకున్నట్లు మరే నేతను అంతలా ఓన్ చేసుకోలేదు. ఆయన ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీకి కొంత హైప్ వస్తుందని అందరూ నమ్ముతున్నారు.అందుకే ముద్రగడ పద్మనాభం కోసం అన్ని పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. కాపులను ఘోరంగా మోసం చేసిన టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక జనసేనలోకి వెళ్లారా అంటే .. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో అంటకాగుతున్నారు.

ఇక ముద్రగడ పద్మనాభంకు మిగిలింది వైసీపీనే. దీంతో వైసీపీకి మద్దతుదారుగా ముద్రగడ పద్మనాభం నిలుస్తారని, వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనే పార్టీకి కీలకంగా మారతారన్న టాక్ వినపడుతుంది. ఆయన కోరుకుంటే రాజ్యసభ పదవి కాని లేదంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీటు గాని ఇస్తామన్న ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది. ముదగ్రడ కాకపోయినా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఆయన కుమారుడికి అయినా ఎమ్మెల్యే సీటు ఇచ్చి గౌరవించడానికి వైసీపీ పార్టీ రెడీగా ఉంది. ఇక దీనిపై అ అంతిమ నిర్ణయం ముద్రగడదేనని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే.. ఏపీ రాజకీయాలు ఎలాంటి పరిణమాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!