దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిగా విశాఖపట్నంను గుర్తిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమితం ఆయన ఏపీలోని విశాఖలో పర్యటిస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌లు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖను రాజధానిగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు మోదీ నుంచి రాజధాని ప్రకటన వస్తుందని ఎవరు ఊహించలేదు. కాని ఏపీ ప్రభుత్వనికి ముందుగానే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
దీనిపై పూర్తి వివరాల్లోకి ఏపీకి రాజధానిని విశాఖపట్నంను చేయాలని అధికార వైసీపీ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. పరిపాలన అంత కూడా ఒకచోట ఉంటే మరో హైదరాబాద్‌లా మారుతుందని జగన్ వాదన. ఏపీకి అలాంటి సమస్య మరోసారి రాకూడదని ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ చేయలని భావించారు. దీనిలో భాగంగానే…ప్రస్తుత రాజధాని అమరావతిలోనే శాసన వ్యవస్థ , విశాఖలో పరిపాలన వ్యవస్థ, కర్నూల్‌లో న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయలని నిర్ణయించారు. కాని దీనిపై అటు ప్రతిపక్షాలు.. ఇటు కోర్టుల నుంచి అభ్యంతరాలు రావడంతో.. దీనిని అమలు చేయడానికి సమయం పడుతుంది. మూడు రాజధానులపైనే తాము ఎన్నికలకు కూడా వెళ్తామని వైసీపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు.
మోదీ ఏపీ టూరుకు ముందు న్యాయవ్యవస్థలోని కొన్ని సమస్యలు తొలగిపోవడం కూడా జగన్ సర్కార్‌కు కలిసి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విశాఖను రాజధాని కేంద్రం గుర్తించిందని తెలుస్తోంది. అభివృద్ది చేయడానికి అని సదుపాయాలు ఉన్న ప్రాంతం కావడం…అతి పెద్ద తీర ప్రాంతం కావడం ఇవ్వన్ని కలగలిసి.. విశాఖను రాజధానిగా చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే సమయంలో జగన్ కూడా విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కూడా కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే మోదీ టూర్ తరువాత జగన్ విశాఖకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతి పోరాటం బూడిదలో పోసిన పన్నీరాయే. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.