Thursday, April 25, 2024

పాదయాత్ర ప్రాక్టీస్ చేయడం ఏంటీ లోకేశం..!

- Advertisement -

రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికలు టీడీపీ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘెరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లలలో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరులో ఆయన తప్ప మరెవ్వరు కూడా విజయం సాధించలేకపోయారంటే పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఆ ఎన్నికల్లో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఘోరంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే. ఇటువంటి పరిస్థుతుల్లో టీడీపీ గెలుపును తన భూజాల మీద మోయడానికి పార్టీ యువ కిశోరం నారా లోకేష్ రెడీ అయ్యారు. వచ్చే జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి సన్నద్దం అవుతున్నారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా.. తన పాదయాత్రను వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేసిన పాదయాత్రతో పోల్చుకుంటున్నారాయన. నారా లోకేష్ ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది.. కాని ఆయన జగన్ చేసిన పాదయాత్రను చూసి ప్రాక్టీస్ అవుతున్నారట. పాదయాత్రలో జగన్ పలికిన హావభావాలు, ప్రజలను అక్కున చేర్చుకున్న విధానం వీటన్నింటిని నారా లోకేష్ నిశితంగా పరిశీలిస్తున్నారట.పాదయాత్రకు సంబంధించి లోకేష్ హైదరాబాద్ లో కొంతమంది నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్రలో ప్రజలతో ఎలా మెలగాలి? వారిని ఎలా ఆకట్టుకోవాలి? యువతీ యువకులు, చిన్నారులతో ఎలా వ్యవహరించాలి? అనేది జగన్ పాదయాత్రల వీడియో పుటేజిని నారా లోకేష్ పరిశీలిస్తున్నారట.

పాదయాత్రకు సంబంధించి.. నిపుణుల సమక్షంలో ప్రాక్టీస్ అవుతున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. వైఎస్ జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులపాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. జగన్‌కు మించి పాదయాత్ర చేయాలని నారా లోకేష్ భావిస్తున్నారు. పార్టీలో జోష్ నింపడానికి నారా లోకేష్- పాదయాత్రకు దిగనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు. పాదయాత్రను ప్రాక్టీస్ అవ్వడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తస్సాదియ్య పాదయాత్ర ప్రాక్టీస్ చేయడం ఏంటయ్యా..? పాదయాత్ర ప్రాక్టీస్ చేయడం ఏంటీ లోకేశం..! అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన వారందరు కూడా సీఎం అయ్యారు. మరి నారా లోకేష్ పాదయాత్ర టీడీపీని ముంచుతుందో .. లేక ఒడ్డున చేర్చుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!