Sunday, October 13, 2024

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు పై అష్ట దిగ్బంధనం .. తప్పించుకోవడం IMPOSSIBLE

- Advertisement -

Chandrababu : ఏపీతో పాటు దేశాన్ని అట్టుడికిస్తున్న శ్రీవారి లడ్డుల ఇష్యూ ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల చేసిన సంచలన ప్రకటన ప్రపంచంలోని హిందువులలో కలవరం రేపింది. ఆ మీదట ఈ బాణాలు అన్నీ సూటిగా వెళ్ళి వైసీపీని తాకాయి. ఇక జగన్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఇక టీటీడీకి నాలుగేళ్ల పాటు చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి అయితే సుప్రీం కోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారాలు జరగకపోయినా చంద్రబాబు పని గట్టుకుని శ్రీ వారి ఆలయ ప్రతిష్ట దెబ్బ తీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రజలు నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు.

అంతే కాదు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అన్న ఆరోపణల మీద సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణులతో కానీ పూర్తి విచారణ జరిపించాలని అలాగే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మాజీ ఎంపీ మరియు బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే బాబు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళారు. బాబు చేసిన లడ్డూ వ్యాఖ్యలు అన్నీ ఆధారం లేనివి అని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. అందుకే దీని మీద న్యాయ స్థానం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని ఆయన కోరారు.

ఇలా ఒకే సమయంలో ఇద్దరూ సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో లడ్డూ ఇష్యూ అత్యున్నత న్యాయ స్థానం పరిధిలోకి వెళ్ళింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరో వైపు రోజు రోజుకీ కూటమి ప్రభుత్వం రకరకాల ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ కోర్టు ద్వారానే న్యాయ విచారణతోనే దీనిని ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందని భావిస్తోంది. లేకపోతే ఇది అంతకంతకూ పెరిగి పార్టీకి మరింత డ్యామేజ్ తెస్తుందని అప్పుడు టోటల్ వైసీపీ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందని పార్టీ నాయకులు కలవర పడుతున్నారు. మొత్తానికి చూస్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో కచ్చితమైన చర్యలకు దిగుతుందని వారు అనుకుంటున్నారు. చాలా విషయాలలో కీలకమైన తీర్పును ఇచ్చిన దేశ ఉన్నత న్యాయ స్థానం తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా వ్యవహరిస్తుందని వారు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే చంద్రబాబుకి అష్ట దిగ్బంధనం అని అప్పుడు ఆయన తప్పించుకోవడం అసాధ్యమని వారు కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!