Wednesday, April 24, 2024

కౌలు అందటం లేదట..జగన్‌పై ఫిర్యాదు చేసిన నిర్మాత అశ్వనీదత్

- Advertisement -

నిర్మాత అశ్వనీదత్ జగన్ సర్కార్ మీద మరో పోరాటానికి సిద్దం అయ్యారు. నిర్మాత అశ్వనీదత్ జగన్‌కు బద్ద వ్యతిరేకి అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన తొలి నుంచి కూడా టీడీపీకి అనుకులుడుగానే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి కూడా ఆయన ఆ పార్టీకి సానుభూతిపరుడుగానే ఉన్నారు. అశ్వనీదత్ వైజాయింతీ బ్యానర్ లోగోలో కూడా ఎన్టీఆర్ ఫొటో ఉంటుంది. ఒకే సామాజికవర్గం వారు కావడంతో..అశ్వనీదత్ టీడీపీకి అండగా ఉంటున్నారు. అశ్వనీదత్ 2004లో టీడీపీ తరుఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. లగడపాటి రాజగోపాల్ చేతిలో అశ్వనీదత్ ఘోరంగా ఓడిపోయారు.

ఆ తరువాత అశ్వనీదత్ క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి కూడా టీడీపీకి మాత్రం దగ్గరగానే కొనసాగారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావాడాన్ని ఆయన ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో ఏపీలో పాలన ఏమాత్రం బాలేదని.. ప్రజలు మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని వ్యాఖ్యనించారు. రాజధాని కూడా అమరావతినే కొనసాగాలని తారు కోరుకుంటున్నానని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తనకు ప్రభుత్వం కౌలు ఇవ్వడం లేదని జగన్ సర్కార్ మీద హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారాయన.

గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ది కోసమని చంద్రబాబు అడిగితే తమ 39 ఏకరాల భూములను కౌలుకు ఇచ్చామని..టీడీపీ ప్రభుత్వం కౌలు సమయానికే ఇచ్చిందని.. కాని ప్రస్తుత ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదని అశ్వనీదత్ దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో జరిగిన విచారణలో విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన వారికి వార్షిక కౌలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏది ఏమైనప్పటికి కూడా తమ నాయకుడు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా ప్రవర్తించడం టీడీపీ నేతలకే చెల్లిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!