Tuesday, September 10, 2024

వైసీపీలో కలకలం ..ఆలీతో రఘురామ కృష్ణంరాజు భేటీ

- Advertisement -

వివాస్పద ఎంపీ రఘురామ కృష్ణంరాజు అధికార వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే. వైసీపీ తరుఫున గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీ మీదనే విమర్శలు చేస్తన్నారు. అటు వైసీపీ కూడా రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసింది. గడిచిన కొద్దికాలంగా రఘురామ కృష్ణంరాజు సైలెంట్‌గానే ఉంటున్నారు. ఎల్లో మీడియా కూడా ఆయన్ను దూరంగా ఉంచుతుంది. ఇదిలా ఉంటే నటుడు, వైసీపీ నేత ఆలీని రఘురామ కృష్ణంరాజు కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నాయకులకు రఘురామ కృష్ణంరాజు దూరంగా ఉంటున్నారు.

అలాంటిది ఆయన అలీతో ఎందుకు భేటీ అయ్యారా అనే ప్రశ్న అందరిలోను మెదులుతుంది. వీరిద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీరిద్దరు కూడా నటుడు కృష్ణ నివాసంలో కలిసినట్లుగా సమాచారం అందుతుంది. కృష్ణ మృతికి నివాళులు అర్పించడానికి ఇద్దరు కూడా ఒకే సమయంలో అక్కడకు రావడంతో…మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భేటీలో రాజకీయాల గురించి చర్చకు రాలేదని.. కేవలం ఒకరికి ఒకరు ఎదురుపడటంతోనే.. మాట్లాడుకున్నారని సమాచారం అందుతుంది.

దాదాపు వీరద్దరు కూడా 5 నుంచి 10 నిమిషాలు వరకు చర్చించుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులు తెలుపుతున్నారు. వీరిద్దరు మాట్లాడుకుంటున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కృష్ణ మృతికి నివాళులు అర్పిచేందుకే జగన్ వచ్చే ముందే రఘురామ కృష్ణంరాజు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒకవేళ జగన్ సమయంలో రఘురామ కృష్ణంరాజు అక్కడే ఉండి ఉంటే… పరిస్థితి ఎలా ఉండేదో అని చాలామంది చర్చించుకుంటున్నారు. మొత్తనికి ఆలీతో రఘురామ కృష్ణంరాజు ముచ్చట్లుకు సంబంధించిన ఫోటో మాత్రం వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!