Saturday, April 20, 2024

అచ్చెన్నాయుడుపై టీడీపీ రివర్స్ ఎటాక్

- Advertisement -

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో ఊసే లేకుండా పోయారా అంటే అవుననే అంటున్నారట అక్కడి ప్రజలు… పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు అప్పుడప్పుడు జిల్లాలో పర్యటనలు చేసే వారని… పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఊసే కరువైందని అంటున్నారట…

టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారట… కానీ అచ్చెన్నాయుడు మాత్రం వారికి భరోసా ఇచ్చేందుకు వెళ్లకున్నారని ప్రచారం సాగుతోంది… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కింజరపు ఫ్యామిలీకి అనుచర వర్గం ఉంది… 2019 ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలిచినా ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు గెలిచేరు..

ఇక వారి గెలుపుకు కృషిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్నారట అయితే వారిని పరామర్శించేందుకు అచ్చెన్నాయుడు వెళ్లకున్నారట అప్పుడప్పుడు తన స్వగ్రామం కు వెళ్లి వస్తుంటారు కానీ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండరట… అందుకే ఇప్పుడు ఆయనపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారట…

కాగా అచ్చెన్నాయుడు టీడీపీ తరఫున పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారాయన

మరోవైపు ఇక్కడ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా ఉంటుంది.. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడుని ఎలాగైనా ఓడించి వైసీపీ జెండా ఎగరవేయాలని చుస్తోందట… చూడాలి ఇక్కడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!