Sunday, September 8, 2024

క్షేత్రస్థాయిలో వైసీపీ చాలా బలంగా ఉందని ఒప్పుకున్న టీడీపీ ఎన్నికల వ్యూహాకర్త

- Advertisement -

గత శనివారం జరిగిన టీడీపీ విసృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాకర్త అయిన రాబిన్ శర్మను పరిచియం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం రాబిన్ శర్మ పని చేయనున్నారనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా రాబిన్ శర్మను చంద్రబాబు పార్టీ నేతలకు పరిచియం చేశారు. ఈ సమయంలో ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేది పార్టీ నేతలతో చర్చించారు. ఈ సమయంలో రాబిన్ శర్మ మాట్లాడుతూ…క్షేత్రస్థాయిలో వైసీపీ చాలా బలంగా ఉందని రాబిన్ శర్మ ఒప్పుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారనే అభిప్రాయం వ్యాప్తి చేస్తోందని చెప్పుకొచ్చారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో జగన్ విజయవంతం అయ్యారని రాబిన్ శర్మ చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్రజల్లో కూడా జగన్ పాలన మీద ఓ నమ్మకం ఏర్పడిందని…తద్వారా ప్రభుత్వం పైన సానుకూలత పెంచుకొనే ప్రయత్నం చేస్తుందని రాబిన్ శర్మ విశ్లేషించారు.

ముఖ్యంగా మనం దీనిపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాబిన్ శర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కౌంటర్‌గా ప్రతిపక్ష పార్టీగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రాబిన్ శర్మ టీడీపీ నేతలకు సూచించారు. క్షేత్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేకత పరిస్థితులను అనుకూలగా మలచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహానికి ధీటుగా.. ప్రజా సమస్యల పైన పోరాటం అవసరమని నిర్దేశించారు.

ఎన్నికల వరకు నేతలంతా ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నియోజకవర్గాల వారీగా రాబిన్ శర్మ టీం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కూడా రాబిన్ శర్మనే ఎంపిక చేస్తారనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ టీంతో కలిసి పని చేశారు.

2019 ఎన్నికల సమయంలో నాడు జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీంలో రాబిన్ శర్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. కాని తరువాత ప్రశాంత్ కిశోర్ టీం నుంచి రాబిన్ శర్మ బయటకు వచ్చి సొంతంగా ఎన్నికల టీంను రెడీ చేసుకున్నారు. రాబిన్ శర్మ తొలిసారిగా టీడీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా పని చేస్తున్నారు. మరి రాబిన్ శర్మ ఎలాంటి వ్యూహాలతో టీడీపీని గెలిపిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!