Monday, July 22, 2024

చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్న వంగవీటి రాధా..బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు..?

- Advertisement -

వంగవీటి రాధా మరోమారు వార్తల్లో నిలిచారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే వంగవీటి రాధా టీడీపీలో ఎప్పుడు కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉంది లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది తక్కువే అని చెప్పాలి. తాజాగా టీడీపీ కీలక నేతలు వంగవీటి రాధా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వంగవీటి రాధా మరోసారి పార్టీ మారుతున్నారనే వార్త తెర మీదకు వచ్చింది. అందుకే టీడీపీ నేతలు వంగవీటి రాధా సమావేశం అయి.. ఆయన్ను బుజ్జగిస్తున్నారని అంటున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… వంగవీటి ఈ పేరు వింటే చాలు చాలామంది రాజకీయా అభిమానులకు పునకాలు వస్తాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగాకు ఎంతటి పేరుందో అందరికి తెలిసిందే. వంగవీటి రంగా రాజకీయాల్లో ఎంతటి విజయాలు సాధించారో , ఆయన తనయుడుగా వంగవీటి రాధా అంతటి పరాజయాల పాలైయ్యారు. వంగవీటి రంగా వారసత్వాన్ని వంగవీటి రాధా కొనగించలేకపోయారు. రాజకీయాల్లో వంగవీటి రాధాది అట్టర్ ఫ్లాప్ సినిమాగా మారింది. తన తండ్రికి ఉన్న పేరు మొత్తన్ని కూడా రాధా చెడగొట్టారని ఆయన వర్గమే చర్చించుకోవడం విశేషం.

వంగవీటి రాధా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌‌ఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సంబర్భంలోనే వంగవీటి రాధా కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వంగవీటి రాధా ఎమ్మెల్యేగా విజయం సాధించడం అదే మొదటిసారి , చివరిసారి కూడా కావడం విశేషం. వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీని కాదని చిరంజీవి ప్రజరాజ్యం పార్టీలో చేరారు. పార్టీ మారద్దని వైఎస్‌‌ఆర్ ఎంత నచ్చచెప్పినప్పటికి కూడా ఆయన మాట వినకుండా పార్టీ మారారు రాధా. 2009లో ప్రజరాజ్యం తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణమాలతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అప్పటికే వైఎస్ఆర్ తనయుడు జగన్ సొంతంగా పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు వంగవీటి రాధా. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ ఓడిపోయారాయన.

పార్టీ కూడా ఓడిపోవడంతో రాధా ఓటమిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇదే సమయంలో ఆయన వైసీపీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ అధినేత జగన్‌పై అనేక విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. వైసీపీకి రాజీనామా చేసి తన తండ్రిని చంపిన టీడీపీలో చేరి ఘోర తప్పిదమే చేశారు రాధా. ఆ పార్టీలో చేరి చివరికి తన రాజకీయ ప్రత్యర్థుల పక్కనే కూర్చోని తన అనచరులకు సైతం అసహ్యం కలిగేలా చేశారాయాన. ఇక వంగవీటి రాధాకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ కూడా కేటాయించలేదు టీడీపీ అధినేత. రాధాను కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుని వదిలేశారు చంద్రబాబు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాధా కనుక వైసీపీలోనే కొనసాగి ఉంటే ఆయన్ను ఈ రోజున మంత్రి పదవిలో చూసేవారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి రాధా పెద్దగా రాజకీయాల్లో కనిపించింది లేదు.

ఆ మధ్య అమరావతి రైతుల కోసం వచ్చిన ఆయన … ఏదో వచ్చామా , వెళ్లామా అనేలా బిహేవ్ చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇది పక్కన పడితే ఆయన తాజాగా మరోసారి పార్టీ మారడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాధా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండలని డిసైడ్ అయ్యారట. అయితే తనకు టీడీపీ సరైన పార్టీ కాదని ఆయన భావిస్తున్నారట. అందుకే రాధా పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు..పార్టీ నేతలను రాధాను బుజ్జగించడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. వంగవీటి రాధాకృష్ణ రాబోవు రోజుల్లో జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దాదాపు ఖాయమౌతుందనే భరోసాను వంగవీటికి ఇచ్చినట్లు చెబుతున్నారు.స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాడేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కొల్లు రవీంద్ర సూచించినట్లు చెబుతున్నరు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!