Saturday, October 5, 2024

Jagan: మేము జగన్ తోనే .. ప్రకంపనలు పుట్టించే ప్రకటన చేసిన కేంద్ర పెద్దలు..?!

- Advertisement -

Jagan: తిరుమల ప్రసాదం విషయంలో ఇంకా తేలని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఓ పక్క వివాదం కొనసాగుతుండగా, మరోపక్క ఈ మౌలిక ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ప్రసాదంలో సాధారణ వెజిటబుల్ ఆయిల్ కల్తీ అంటే వనస్పతి, పామాయిల్ లేదా గేదె నెయ్యి వంటివి అయితే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ బీఫ్, చేప, పంది కొవ్వు నూనె కలిసిందని చెప్పడం వివాదం పెరగడానికి కారణమైంది. ఈ సమయంలో చాలామంది మదిలో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. ఆ ప్రశ్నలే కేంద్రం కూటమి ప్రభుత్వాన్ని అడిగినట్లు సమాచారం. అవి ఏంటంటే

  1. ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ నుంచి పది నెయ్యి ట్యాంకర్లు రాగా ఆరు ఉపయోగించామని, మిగతా నాలుగు ట్యాంకర్ల శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మొత్తంగా ఏఆర్ డెయిరీ సంస్థ తన పీరియడ్‌లో సరఫరా చేసిన మొత్తం నెయ్యి పరిమాణం ఎంత? అందులో వాడింది ఎంత? తిరస్కరించింది ఎంత?
  2. అనుమానం వచ్చిన ట్యాంకర్లను పరీక్షించి వెనక్కి పంపినప్పుడు, భక్తులకు చేరిన ప్రసాదాల్లో ఆ నెయ్యి కలవనట్టా? కలిసినట్టా? ఒకవేళ ఆ ఆరు ట్యాంకర్ల నెయ్యి కూడా అనుమానాస్పదంగా ఉండి ఉంటే వారు వాటి శాంపిళ్లను కూడా పంపించేవారు కదా? ఆ ఆరు ట్యాంకర్లూ బాగున్నాయి అనుకుంటే భక్తులకు జంతు కొవ్వు వల్ల కల్తీ అయిన నెయ్యితో చేసిన పదార్థాలు అందలేదన్నట్లే. అలా కాదు, ఆ ఆరు కూడా కల్తీనే అనుకుంటే, అప్పుడు ప్రొసీజర్ ప్రకారం టెస్టులు ఎందుకు చేయలేదు?
  3. జులై 23న ల్యాబ్ నివేదిక వచ్చింది. మరుసటి రోజు ఈవో మాట్లాడుతూ వెజిటబుల్ ఫ్యాట్‌ల గురించి చెప్పారు తప్ప, యానిమల్ ఫ్యాట్ గురించి చెప్పలేదు. దానిపై పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు తాను నివేదికను అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఎక్కడ వెజిటబుల్ ఫ్యాట్ గురించి రాశారో అదే పేజీలో యానిమల్ ఫ్యాట్ గురించి కూడా రాసి ఉంది. కాబట్టి గమనించక పోయే ప్రశ్నే లేదు. పోనీ దానికి సంబంధించిన సాంకేతిక సమాచారం తెలియదు అనుకుంటే, టీటీడీకి సొంత డెయిరీ ఉంది. మైసూరు సీఎఫ్టీఆర్ఐ వారు టీటీడీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని ఆయనే చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా టీటీడీ ఈవో ఫోన్ చేస్తే వివరాలు చెప్పనివారు ఉండరు. ఆఖరికి ఆ పరీక్షలు చేసిన ల్యాబ్ వారికి ఫోన్ చేసినా వివరాలు చెబుతారు. వీరెవ్వరిని అయినా టీటీడీ ఈవో సంప్రదించి ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకోవచ్చు కదా? ఏ రకంగా వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే కలిసిందని అప్పుడు, యానిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని ఇప్పుడు నిర్ధరణ చేయగలిగారు?

ఈ మూడు ప్రశ్నలకి ఆధారాలతో సహా త్వరలోనే తమకు సమాధానం ఇవ్వాలని ఇందులో నిజానిజాలు బయటపడి జగన్ ప్రభుత్వానిది తప్పు ఏమీ లేదని తేలితే తాము జగన్ వెంటే ఉంటామని కూటమి ప్రభుత్వానికి ప్రకంపనలు పుట్టించే ప్రకటన కేంద్ర పెద్దలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!