Sunday, September 8, 2024

వైఎస్ షర్మిల అరెస్ట్ ..?

- Advertisement -

వైఎస్ఆర్ తనయురాలు, ఏపీ సీఎం జగన్ సొదరి, వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఆమె వైఎస్సార్టీపీ పార్టీ బాలోపేతానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే..ఆమె తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో షర్మిల ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగలో షర్మిల స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల దారుణంగా విమర్శలు చేశారు.. షర్మిల చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం. నర్సంపేటలో జరుగుతున్న పాదయాత్రలో పెద్దయెత్తున పోలీసులు పాల్గొనడంతో ఈ ఊహాగానాలు వ్యాపించాయి.

నర్సంపేటలో జరగుతున్న పాదయాత్రలో నలుగురు ఏసీపీలు, 500 మంది పోలీసులు ఒక్కసారిగా రావడంతో షర్మిలను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గుప్పమన్నాయి. ఆదేశాల కోసం… ఉన్నతాధికారుల ఆదేశాల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు పెద్దయెత్తున మొహరించారని చెబుతున్నారు. ఒకవేళ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటా అని కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారట. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేస్తున్నారని వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో.. వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు భారీ ఎత్తున నర్సంపేటకు చేరుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!