చాల సినిమాల తరువాత హిట్ ట్రాక్ ఎక్కాడనుకున్న నితిన్ కు బ్యాక్ టూ బ్యాక్ ప్లాపులతో మరల తన ప్లాపుల ట్రాక్ ఎక్కి కన్ఫ్యూషన్ లో ఏమి చేయాలో అర్ధం కాక, తన మొదటి సినిమా నిర్మాత దిల్ రాజుతో సినిమా కోసం వెంపర్లాడి చివరకి బొక్కబోర్లా పడ్డాడని సినిమా చూసిన ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.

పెళ్లి వేడుకతో మొదలైన సినిమా, మరలా అదే పెళ్లి వేడుకతో అదే గోలతో ప్రేక్షకులను తికమక పెట్టి, మధ్యలో నాలుగు క్లాసులు పీకి, మీరు చేసేది పెళ్లి కాదు మేము చేసేదే పెళ్లి అంటూ ప్రేక్షకుల సహనానికి పరీక్షించిన సినిమా మన శ్రీనివాస కళ్యాణం.

సినిమాలో మొదటగా టైం వేస్ట్ చేయని ఒక పెద్దమనిషికి, వారం పాటు పెళ్లి చేస్తేగాని పెళ్లి చేసినట్లు కాదు అనుకునే మరో కుటుంబానికి మధ్య జరిగే సంఘర్షణ మాత్రమే దర్శకుడు హైలెట్ చేసి, కామెడీ ట్రాక్ లాంటి మిగతా వాటిని పక్కన పడేసి ప్రేక్షకుడు సినిమా చూడటానికి వస్తున్నాడా లేక పెళ్లి వేడుక చూడటానికి వస్తున్నాడా అనే పాయింట్ ప్రేక్షకులకు అర్ధం కాక థియేటర్ తలుపులు ఎప్పుడు తీస్తారురా దేవుడా అనేలా సహనాన్ని పరీక్షించారు.

ఇందులో టైం వేస్ట్ చేయని క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నటించగా, వారం పాటు పెళ్లి వేడుక చేయాలన్న భ్రమలో మునిగిపోయే క్యారెక్టర్ లో జయసుధ నటించారు. అసలు మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళిలో కూర్చుని మొత్తం పెళ్లి తంతు చూడాలి అంటేనే బోర్ గా ఫీల్ అవుతాం, కానీ పెళ్లి వేడుకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హడావిడి, విందు వినోదాలతో అంతా ఆసక్తిగా సందడి సందడిగా గడిపేస్తుంటారు. కానీ ఈ సినిమాలో విందు వినోదాలు లేవు, హీరో మొదటి నుంచి పెళ్లి టాపిక్ వస్తే చాలు క్లాసులు పీకుతూనే ఉంటాడు. సినిమా చివర్లో కూడా క్లాసుల మీద క్లాసులు పీకుతూ ఇక మీ గోల అపాండిరా బాబు అనేలా చేసి నితిన్ మరొక తప్పటడుగు వేసాడు.

సినిమాలో ఎక్కడ ప్రేక్షకుడిని ఫీల్ కు గురిచేసే ఒక సీన్ కూడా లేకపోవడం, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమా ఇంటర్వెల్ సమయానికి టైం వేస్ట్ చేయని అహంకారి పాత్రను హీరో తాను అనుకొన్న విధానం తప్పు, పెళ్లంటే నూరేళ్ళ పంట అని తెలియ చెప్పబోతున్నాడని ఇంటర్వెల్ సమయానికి ప్రేక్షకుడు అర్ధం చేసుకోవడంతో సినిమా తేలిపోతుంది.

అసలు పెళ్ళికి ముందు డైవర్స్ ఏమిటో ఎవరకి అంతు చిక్కటం లేదు. నా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే పెళ్ళికి ముందే డైవర్స్ తీసుకొని మీరు పెళ్లి చేసుకోవాలి అనే తలక మాలిన కాన్సెప్ట్ తో దర్శకుడు సతీష్ విగ్నేష్ చేసిన ప్రయత్నాన్ని ఎవరు హర్శించారు. భార్యకు భయపడే క్యారెక్టర్ సినిమా మొత్తం ఒకే రకమైన కామెడీ ట్రాక్ నడిపిస్తూ పూర్తిగా పట్టుకోల్పోయింది. సంగీతం విషయంలో మిక్కీ జె మేయర్ ఈ సినిమాలో ఆకట్టుకోలేక పోయాడు.రాశి కన్నా తన బాబ్లీ లుక్స్ తో తన వరకు తాను ఆకట్టుకోగలిగింది.

చివరగా : ఈ పెళ్లి గోల మాకొద్దు
రేటింగ్ : 2.25/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి