విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం కలక్షన్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ వసూళ్లను సాధించిన సర్కార్.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. రెండు రోజుల్లోనే కేవలం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసినట్లు సమాచారం. టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది సర్కార్.

అయితే ఇందులో జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండి పడుతున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.