అడవి శేషు హీరోగా, కథ రచయితగా వచ్చి స్పై థ్రిల్లర్ సినిమా “గూఢచారి” హిట్ టాక్ తో ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలంతా అడవి శేషు వైపు చూస్తున్నారు. అడవి శేషుతో సినిమా చేయడానికి అందరూ ఉత్సాహం చూపిస్తుంటే, ఇతను మాత్రం తన తరువాత సినిమా కోసం కూల్ గా వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. తన కొత్త సినిమాకు కూడా అడవి శేషు కథ, కథనం అందించనున్నాడు. ఈ సినిమాలో ఒక పోలీస్ గా నటించనున్నాడని తెలుస్తుంది. రామ్ జీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. రెజీనా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎమ్పికైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా క్షణం-2 అని పెట్టారు. ఈ సినిమాకు మెయిన్ టైటిల్ క్షణం 2 గా ఉంటుందా లేక వర్కింగ్ టైటిల్ వరకే పరిమితమవుతుందా అనేది చూడాలి.