అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక రెండవ చిత్రం ‘హలో’ సినిమా పర్వాలేదనిపించిన అది అఖిల్ కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగ పడలేదు.ఇక తాజాగా అఖిల్ నటించిన చిత్రం MR మజ్ను. ఈ సినిమా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు అఖిల్ నాల్గవ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

వరస పరాజయాలతో వెనుకపడిపోయిన డైరెక్టర్ శ్రీను వైట్ల.. అఖిల్ కోసం ఓ స్టోరీని సిద్ధం చేసాడట. అంతేకాదు ఇటీవల శ్రీను వైట్ల, అఖిల్ తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దాంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. మరి శ్రీను వైట్లతో సినిమా చేయడానికి అఖిల్ ఒప్పుకుంటాడా లేదో వేచి చూడాలి.