‘మిస్టర్ మజ్ను’ తర్వాత యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. వరసగా మూడు సినిమాలు నిరాశపరచడంతో ఎలాగైనా అఖిల్ కి హిట్ రుచి చుపించాలనుకుంటున్నాడు అల్లు అరవింద్. బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు భాస్కర్. ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడంపై ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ప్రకటన విడుదల చేసారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇక ఈ మూవీ లో అఖిల్ కు జోడిగా ‘టాక్సీ వాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. తెలుగులో ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. గీత ఆర్ట్స్లో సినిమా అనే సరికి ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. మరి అఖిల్ ఈ సినిమాతో నైనా హిట్ కొడతాడేమో వేచి చూడాలి.

priyanka jawalkar