మహేష్ బాబు 25 వ సినిమాగా వస్తున్న “మహర్షి” పేరుతో పాటు టీజర్ కూడా అదరగొట్టాడు. సరికొత్త టైటిల్ తో పాటు, సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ 24 గంటలలో యూట్యూబ్ లో మూడు మిలియన్స్ వ్యూయర్స్ క్లబ్బులో చేరి రికార్డు సృష్టించాడు. ఇక ఈ సినిమాలో మహేష్ ను సరి కొత్తగా చూపించడానికి దర్శకుడు వంశ పైడిపల్లి కృషి చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక మూక్యపాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రపై ఎప్పటి నుంచో అనేక రకాలైన రూమర్స్ వస్తున్నాయి. అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటిస్తున్నాడని అభిమానులు ఎప్పటి నుంచో సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు. ఇక నరేష్ మహేష్ బాబుకి పుట్టినరోజు విషెష్ చెబుతూ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. “రవి టూ రిషి” అని ట్విట్టర్ లో నరేష్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారిపోయింది. ఇది వరకు జరిగిన ప్రచారం నరేష్ పెట్టిన ట్విట్ తో సింక్ అవ్వడంతో కథలో భాగంగా రిషి తన స్నేహితుడి కోసం అమెరికా నుంచి ఇండియా వస్తాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజమయ్యేలా ఉంది. ఇక ఈ సినిమాలో నరేష్ – మహేష్ బాబు స్నేహ బంధం ఎంత వరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వచ్చే 2019 సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే.