సైరా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నడుస్తుంది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సైరా సినిమాలో ఇప్పుడు కొత్త న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రుద్రమదేవి సినిమాలో “గోన గన్నారెడ్డి” పాత్రలో పవర్ ఫుల్ డైలోగ్స్ చెప్పిన అల్లు అర్జున్ సైరా సినిమాలో అంత కన్నా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్ రాకతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినపడుతున్నాయి. ఇంతవరకు దీనిపై యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. సైరా సినిమాలో కోలీవుడ్, శాండీల్ వుడ్, బాలీవుడ్ నుంచి పేరున్న నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబచ్చన్ చేయనున్నాడనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి కొణిదెల నిహారిక కూడా “గోన గన్నారెడ్డి”లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2019 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేస్తుంది.