‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆ గ్యాప్ ను పూరించే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమా మార్చి నెలలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉంటె ఈ సినిమా పూర్తియే లోపు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.

‘సర్కార్’ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫాదర్ సెంటిమెంటుతో ఉండబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఈ సినిమాలో కియారా, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారు.