అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ నెల ఖర్చు 4500 రూపాయలు మాత్రమే అట. అతను నెల వారి తన ఖర్చులను ఎలా పెడతాడో కూడా ఒక చోట రాసి పెట్టుకున్నాడు. దానిని మనం కింద ఉన్న ఫొటోలో చూడవచ్చు. ఒక హీరో తన నిత్యావసరాల కోసం నెలకు లక్షలలో ఖర్చులు చేస్తాడు. బట్టలు, విమాన ప్రయాణ చార్జీలు, ఇంకా ఇతర ఖర్చులు ఇలా చూస్తే మొత్తం తడిసి మోపిడవుతుంది.

Allu Sirish New Movie ABCD

కానీ అల్లు శిరీష్ మరీ ఇంత తక్కువ ఖర్చు పెడుతున్నాడా అంటే నమ్మలేం. కానీ అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త సినిమాలో అల్లు శిరీష్ పెట్టె ఖర్చు తప్ప, రియల్ లైఫ్ కాదని అల్లు శిరీష్ ట్విట్టర్ వేదికగా తెలియచేసాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ “ఎబిసిడి” అనే సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమాలో అల్లు శిరీష్ ఖర్చులు పై విధంగా ఉంటాయట. అంటే అల్లు శిరీష్ ఒక మద్య తరగతి కుటుంబానికి సంబంధించిన రోల్ లో నటిస్తున్నట్లు కనపడుతుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు సంజీవ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.