సాక్షి టివితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన యాంకర్ అనసూయ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇక అడపా దడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మ అత్త క్యారెక్టర్ లో మెరిసి ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా “మీటూ” వివాదం ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు ప్రముఖ హీరోయిన్స్ మేము కూడా బాధితులమే అంటూ వారి దీన గాధలను తెలియచేస్తున్నారు. దీనిపై అనసూయ మాట్లాడుతూ టాలీవుడ్ లో మహిళలపై వేధింపులు తక్కువేనని, అసలు ఇక్కడ అంతగా భయపడాల్సిన పనిలేదని, లైంగిక వేధింపుల విషయం చాల లైట్ గా తీసుకుంది.

టాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉందని శ్రీరెడ్డి రోడెక్కి పలు నిరసన కార్యక్రమాలు చేసింది. దీనిపై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురిని బయటకు లాగి సంచలనాలు సృష్ట్టించింది. ఇప్పుడు అనసూయ బయటకు వచ్చి అసలు ఇలాంటివి టాలీవుడ్ లో లేవని ఎలా చెబుతుందని, కాస్టింగ్ కోచ్ పేరుతో వేధింపులకు గురైన వారు మండిపడుతున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి చిన్మయి కూడా పలువురు బాధితుల స్క్రీన్ షాట్స్ వదులుతుంది. కానీ ఇంత గొడవ జరిగే సమయంలో వారికి అండగా నిలవకుండా అనసూయ లైట్ తీసుకోవడంతో కొంత మంది ఆగ్రహానికి గురవ్వక తప్పడం లేదు.