Bigg Boss 8: కంటెంట్‌తో సంబంధం లేకుండా టెలికాస్ట్ అయినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటూ హయ్యాస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఎనిమిదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా ఈ ప్రోగ్రాం దేశంలోనే టాప్ షోగా నిలిచి ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయింది. దీంతో నిర్వాహకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. త్వరలో ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే…
తెలుగులో ఏడు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కావడంతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఈ సీజన్ మొదటి నుండి చాలా ఆసక్తికరంగానే సాగుతోంది. ముఖ్యంగా ఇదివరకెన్నడూ చూడని ట్విస్ట్‌లు ఈ సీజన్లో ఉన్నాయి. అలాగే ఈ సీజన్ కూడా రోజురోజుకు కష్టతరంగా మారుతోంది. విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ బిగ్ బో ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌసులోకి ప్రవేశించారు. అయితే మొదటి వారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క ఇంటి నుంచి బయటకు పంపేశారు.
నిజానికి ప్రస్తుతం ప్రసారమవుతున్న 8వ సీజన్‌లో 20 నుంచి 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఎంపికయ్యారు. అయితే ఇది అన్‌లిమిటెడ్ సీజన్ కాబట్టి మిగిలిన వారిని వారం మధ్యలో లేదా వచ్చే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో పంపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొదటి వారాంతంలో ఎవరూ షోలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బిగ్ బాస్ షో అంటేనే అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక, అన్‌లిమిటెడ్‌గా సాగే ఈ ఎనిమిదో సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఈ వారాంతంలో అంటే శని లేదా ఆదివారం ఎపిసోడ్‌లు ముగిసిన తర్వాత ఓ సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవబోతున్నారని తెలిసింది. బిగ్ బాస్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో హౌస్‌లోకి అడుగుపెట్టనున్న సెలబ్రిటీ ప్రముఖ సీరియల్ హీరోయిన్, జబర్ధస్త్ ఫేమ్ రోహిణి అని తెలుస్తోంది. తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కూడా కనిపించింది. మంచి కమెడియన్ కావడంతో ఇప్పుడు మళ్లీ ఆమెను తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను నవ్వించే వారి కొరత ఏర్పడింది. అందుకే బెస్ట్ లేడీ కమెడియన్ అనిపించుకున్న రోహిణిని షోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆమె త్వరగా ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఈ షోలో అడుగుపెడితే మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు.