సీనియర్ హీరోలు, కోతగా వచ్చిన హీరోలు అన్న సంబంధం లేకుండా నటి ఆండ్రియా అందరితోనూ గ్లామర్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంటుంది. ఆమె నటించిన గ్లామర్ పాత్రలు ప్రేక్షకులను కూడా ఇట్టే ఆకట్టుకున్నాయి. “తరమణి” చిత్రంలో తన నటన చాతుర్యంతో ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇటీవల కమల్ హాసన్ హీరోగా విశ్వరూపం-2 సినిమాలో నటించి మంచి ఆక్షన్ సెండ్ తో అందరాని ఆకట్టుకుంది.

ఆండ్రియా మాట్లాడుతూ ఇక నుంచి గ్లామర్ పాత్రలకు స్వస్తి చెప్పి, తన ఇమేజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తానని చెబుతుంది. ఇక నుంచి తనను సంప్రదించే దర్శక, నిర్మాతలకు గ్లామర్ పాత్రలు చేయనని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తుంది. “వడ చెన్నై” సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆండ్రియా ఈ సినిమా ద్వారా తన ఇమేజ్ పెంచుకోవడానికి కృషి చేస్తుంది. కొత్త చిత్రాలలో నటించేటప్పుడు కొన్ని షరతులు పెడుతుందని లిప్ లాక్, స్మోకింగ్ చేసే సన్నివేశాలకు ఇక నుంచి దూరంగా ఉంటానని ఆండ్రియా తేల్చి చెబుతుంది. చాల మంది హీరోయిన్స్ తాము గ్లామర్ పాత్రలు చేయమని చెప్పి, అవకాశాలు సన్నగిల్లే సమయానికి తిరిగి గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతారు. గ్లామర్ పాత్రలు నటించనని చెబుతున్న ఆండ్రియాకు ఎంత వరకు అవకాశాలు అందిపుచ్చుకుంటుందో చూడాలి.