మహేష్ బాబు – వెంకటేష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాలో మహేష్ బాబు వదినగా నటించిన హీరోయిన్ అంజలి సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

మహేష్ బాబుతో పనిచేయడం మీకు ఎలా ఉంది అంటూ ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు చాల సింపుల్ గా, వినయంగా ఉంటాడని మహేష్ తో సినిమా చేయడానికి చాల ఇష్టపడతానని అంజలి తెలియచేసింది. ఇంకా చెబుతూ తనకు ఇష్టమైన సినిమాలు జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని, అందులో క్యారెక్టర్స్ తనకు ఎప్పుడు గుర్తుండిపోతాయని అంజలి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంకా చెబుతూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గొప్ప మనసున్న వ్యక్తని అజిత్ ను ఆకాశానికి ఎత్తేసింది.