టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సందడి చేసాడు. శుక్రవారం నుంచి జరగనున్న టెస్ట్‌ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ చేరుకున్న కోహ్లి.. ఇక్కడే షూటింగ్‌లో పాల్గొన్నాడు. తాజాగా ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న కోహ్లిని టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌ కలిశాడు. తన సతీమణి అనుష్క శర్మ తో కలసి వచ్చాడు కోహ్లీ. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభంకానుంది.

kohli akhil