Thursday, March 28, 2024

బిగ్ బాస్ 6లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు..?

- Advertisement -

రియాల్టీ షో బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలుత హిందీలో మొదలైన ఈ షో అక్కడ సూపర్ హిట్ కావడంతో.. తరువాత అన్న భాషలలో ఈ రియాల్టీ షోను తెరక్కెక్కించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తెలుగులో కూడా ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది ఈ షో. తొలి తెలుగు బిగ్ బాస్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించగా.. రెండో భాగానికి న్యాచురల్ స్టార్ నాని యాంకర్‌గా పని చేశారు. ఇక మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్‌‌బాస్ ఆపేయాలని ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. పెళ్లి కాకుండానే యువతి , యువకులు 100 రోజులు ఒకే ఇంటిలో ఉండటం ఏమిటని కొందరు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారణ చేయాల్సి ఉండగా.. తాజాగా బిగ్‌‌బాస్ మరో వార్త బయటకు వచ్చింది. ఈ షోలో గర్భధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా షో ప్రసారం అవుతున్న టైమింగ్స్ గురించి కూడా ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.

బిగ్ బాస్ షోను సెన్సార్ చేయకుండా యథాతథంగా టీవీల్లో ప్రసారం చేయడంపైనా పిటిషనర్ కేతిరెడ్డి అభ్యంతరాలు తెలిపారు. అలాగే ఇలాంటి షోలను వాస్తవంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా స్టార్ మాలో రాత్రి 9 గంటలకే ప్రసారం చేస్తున్నట్లు కూడా పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై న్యాయమూర్తులు బిగ్ బాస్ షోని చూసి తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలపడం విశేషం. ఇదే సమయంలో కంటెస్టెంట్‌‌లకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేశారా లేదా అనే దానిపై కూడా విచారణ జరుపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ తాజా సీజన్‌కు పెద్దగా రేటింగ్ లేదని తెలుస్తుంది. తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ 6వ సీజన్ కేవలం 5.44 రేటింగ్‌ను సాధించి అట్టడుగున నిలిచింది. మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ కంటే బిగ్ బాస్ రేటింగ్ తక్కువుగా నమోదు అవుతుంది. ఈసారి బిగ్ బాస్‌కు వచ్చిన వారు ఎవరు కూడా అంతగా ఫేమస్ కాకపోవడం కారణంగా తెలుస్తుంది. ఈక్రమంలో బిగ్‌బాస్ గురించి వరుస వివాదాలు చూట్టుముడుతున్నాయి. మరి వీటి నుంచి బిగ్‌బాస్ ఎలా బయటపడుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!