గత ఏడాది భాగమతిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క.. చాలా గ్యాప్ తర్వాత ‘సైలెన్స్’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రలో ద్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

కాగా అమెరికాలో తన వెయిట్ కి సంభందించిన ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనుష్క. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సన్నబడిన అనుష్క లుక్ బాగా వైరల్ అవుతుంది. అనుష్క చెయ్యబోతున్న సైలెన్స్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నుండి షూటింగ్ ను జరుపుకోనున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

anuska setty