Bigg Boss 8: తెలుగు బుల్లితెర రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది బిగ్ బాస్.. అంతే కాకుండా ఈ షో అత్యధిక టీఆర్పీతో నెంబర్ వన్ రియాల్టీ షోగా కొనసాగుతోంది. అందుకే నిర్వాహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ జోష్ లోనే ఎనిమిదో సీజన్ కూడా మొదలైంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సీజన్ ఎన్నో ఊహించని ట్విస్ట్‌లను, సర్ప్రైజ్‌లను ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కంటెస్టెంట్ విష్ణుప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
తెలుగులో ఏడు రెగ్యులర్ సీజన్‌లు, ఒక OTT సీజన్‌ను పూర్తి చేసిన తర్వాత, బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వాహకులు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్ ప్రైజ్ లు ఇస్తూ షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారంలో కొత్త నామినేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఇంట్లో ఇప్పటికే మూడు క్లేన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్లనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు నామినేట్ చేసే ఇద్దరిపై రంగు నీళ్లు పోసి తగిన కారణాలు చెప్పాలన్నారు.
గత వారం ఓ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ మాట్లాడుతూ ‘ఇంతకు ముందు నీకు నిఖిల్ అంటే అంతగా నచ్చలేదు. ఇప్పుడు స్నేహం ఎలా కుదిరింది’ అని సోనియా ప్రశ్నించారు. ‘ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్ట్ కామెడీలో నేను పార్ట్ కాను’ అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన తర్వాత కూడా నాగార్జున విష్ణుప్రియ దే తప్పన్నారు. తాజా నామినేషన్ల టాస్క్‌లో విష్ణుప్రియ మునుపటి గొడవను లాగి సోనియాను నామినేట్ చేసింది. అంతేకాదు, ‘గత వారం జరిగిన దానికి నన్ను క్షమించండి. కానీ మీరు నా మీద అడల్ట్రీ ముద్ర వేశారు. అందుకు నాకు సారీ చెప్పలేదు’ అని ఆమె చెప్పింది. దీనికి సోనియా బదులిస్తూ ‘నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు. నాకు అది అడల్ట్రీనే’ అంటూ వాదించింది.
సోనియా మాటలతో ఫైర్ అయిన విష్ణుప్రియ.. ‘మీ దృష్టిలో నేను ఏ అడల్ట్రీ జోకులు వేసాను?’ అని సూటిగా ప్రశ్నించింది. దానికి సోనియా ‘మీకు వివరణ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు’ అని సమాధానం దాటవేశారు. విష్ణు మాటలకు సహనం కోల్పోయిన సోనియా ‘బట్టలు సరిగ్గా వేసుకోని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు. ఆయన ఒకవైపు అన్ కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసిందంతా ఏంటి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికామె ‘అసలు ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యను కరెక్ట్‌గా వాడాలి’ అంటూ కౌంటర్ వేసింది.