సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన తరువాత మలైకా అరోరా, అర్జున్ కపూర్ తో తన ప్రేమాయణాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలసి గతంలో ఎవరికి తెలియకుండా… ఎక్కడ కనిపించకుండా చాల “లో ప్రొఫైల్” మైంటైన్ చేస్తూ ప్రేమ పావురాలులా విహరించే వారు.

ఇక ఎన్ని రోజులు ఇలా ఎవరికి తెలియకుండా బయట తిరుగుతాం అనుకున్నారో ఏమో, ఎప్పుడు అంతా ఓపెన్ అయినట్లు ఇద్దరు కలసి పార్టీలు, పబ్బులకు తిరుగుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. మీడియాకి ఇప్పుడు నేరుగా ఫోజులు ఇస్తూ త్వరలో తమ అక్రమమైనా బంధాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి పెళ్లి చేసుకోబోతున్నామనే హింట్ కూడా ఇస్తున్నారు.

వచ్చే ఏప్రిల్ లో వీరిద్దరి వివాహం జరగనుందని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. మలైకా అరోరా వయస్సు 50 సంవత్సరాలకు దగ్గరగా ఉంటే, అర్జున్ కపూర్ వయస్సు 30 సంవత్సరాలు దాటాయి. ఇక వీరిద్దరి రొమాన్స్ చూసి ఆశ్చర్య పోతున్న బాలీవుడ్ జనం, ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటే, ఎంత ప్రేమలో మునిగిపోయారో అంటున్నారు. అర్జున్ కపూర్ అంత యంగ్ కుర్రోడై, ఒక ఆంటీ వయస్సు ఉన్న మలైకతో రొమాన్స్ చేస్తూ ఇప్పుడు పెళ్ళికి సిద్ధమవుతున్నాడంటే ఇది మాత్రం చాల డేరింగ్ నిర్ణయమే.