రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే నారా రోహిత్ అంటే ప్రేక్షకులకు కొంత ఆసక్తి ఉంది. నారా రోహిత్ సినిమా వస్తుందంటే ఒక వర్గం వారు కూడా థియేటర్స్ వైపు పరుగులు తీయడానికి సిద్ధం ఉంటారు. అలాంటిది నారా రోహిత్ హీరోగా విడుదలైన “ఆటగాళ్లు” సినిమా మొదటి ఆట నుంచే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి ఆటకే నేరుగా డివైడ్ టాక్ రావడంతో సినిమా పరిస్థితి ఎలా ఉందొ అంచనా వేయవచ్చు. దర్శకుడు పరుచూరి మురళీ ఇంత పేలవమైన సినిమా ప్రేక్షకులకు అందిస్తాడని ఎవ్వరు ఊహించలేదు.

నారా రోహిత్ డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుని ఈమధ్య కాలంలో ఒకటి, రెండు సినిమాలలో నటించి దెబ్బతిన్నాడు. మొదటి ఆటకే సినిమాపై తప్పుడు అంచనాలతో “ఆటగాళ్లు” సినిమా ప్రేక్షకులను ఒక ఆట ఆడుకుంటుందని తేలడంతో సాయంత్రానికి టోటల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.