ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహా నాయకుడు’ బిజీలో ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ రెండు మూడు రోజుల్లో విడుదలవుతుంది. సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడవ సారి నటించనున్నాడు. బాలకృష్ణ సొంత నిర్మాణ సంస్థ ఎన్.బి.కె సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి.. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ చేస్తారట.

ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా నటిస్తాడని సమాచారం. ఈ పాత్ర చుట్టూ సినిమా కథ జరుగుతుందని సమాచారం. అలాగే ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు. బోయపాటి సినిమాలో కూడా బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండటం విశేషం.