నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడవ చిత్రం తెరకెక్కబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు బోయపాటి. కాగా ఈ సినిమాలో నాని ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మించనుంది. ఏప్రిల్ నెల నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.