ఒక బడా హీరోతో బారి ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన తరువాత, ఆ సినిమాకు బిజినెస్ ఎంత గొప్పగా జరిగినా ఆ నిర్మాత సినిమా రిలీజ్ అయ్యేవరకు భయపడుతూనే ఉంటాడు. కారణం ఆ సినిమా కనుక ప్లాప్ అయితే బయ్యర్లు వచ్చి నానా రాద్ధాంతం చేస్తారన్న భయం. కానీ బెల్లం కొండా సురేష్ మాత్రం తన కొడుకు సినిమాలు ప్లాప్ అవుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బారి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ప్రతి సినిమా వెనుక వెల్లంకొండ సురేష్ ఉంటాడని ఇండస్ట్రీ టాక్. కానీ తాను వెనక ఉండి, ముందు వేరే నిర్మాత పేరు వేసి సినిమాను విడుదల చేయిస్తాడు. దీనితో బెల్లంకొండకు గత డిస్ట్రిబ్యూటర్స్ తో సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు రాకుండా చేసుకుంటాడు. అలాగే బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో నిర్మాత అభిషేక్ నామాను ముందు పెట్టి “సాక్ష్యం” సినిమా రూపొందించాడని టాక్.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఖర్చు కూడా భారీగానే పెట్టారు. ఖర్చు కూడా ఇంచు మించు 40 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తుంది. తరువాత ఈ సినిమాను ఈరోస్ వారు అదే 40 కోట్ల రూపాయలకు తీసుకొని విడుదల చేసారు. “సాక్ష్యం” సినిమా విడుదలైన తరువాత ఈ సినిమా మొత్తంగా 10 కోట్లకు మించి కలెక్ట్ చేయలేదని తెలుస్తుంది. అంటే ఈ సినిమా 30 కోట్ల పైగా నష్టాలను మూట గట్టుకుంది. ఇప్పుడు ఈరోస్ వారికి ఈ 30 కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. ప్రతి సినిమా బెల్లంకొండా శ్రీనివాస్ సినిమాలు బారి బడ్జెట్ లతో నిర్మించి యావరేజ్ సినిమాలను కూడా సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లలేక చేతులు కాల్చుకుంటున్నారు. ఈ వారం “శ్రీనివాస కళ్యాణం” సినిమా విడుదలతో అరకొర ఉన్న ఆ మిగిలిన థియేటర్స్ నుంచి సినిమాను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసారు.