బిగ్ బాస్ – 2 ఒక్కో వారం వారం గడిచే కొద్ది, ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగటంతో ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. బిగ్ బాస్ లో చివర వరకు ఉండి ఫైట్ చేస్తుందనుకున్న యాంకర్ శ్యామలను ఈ వారం ఎలిమినేట్ చేయడంతో ప్రేక్షకులతో పాటు, శ్యామల కూడా షాక్ కు గురైంది. దీనిపై ప్రేక్షకులు శ్యామలకు మద్దతుగా నిలిచారు. వచ్చే వరం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తి రేకెత్తించడంతో బిగ్ బాస్ రోజు రోజుకి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ షోలో తేజస్వి హాట్ లుక్స్, స్కిన్ షో తో కుర్ర కారు బిగ్ బాస్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ప్రేమ పక్షులుగా సామ్రాట్ – తేజస్వి, దీప్తి సునైనా – తనీష్ లు విహరించడం కూడా బిగ్ బాస్ షోపై ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇక బిగ్ బాస్ షోలో తేజస్వితో పాటు మరింత గ్లామర్ అద్దడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమారి సినిమా పాప హెబ్బా పటేల్ ను సంప్రదించినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని అడగటం, ఇంకా హెబ్బా తన స్పందన తెలియచేయలేదు. ఒకవేళ హెబ్బా బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీతో వెళితే బిగ్ బాస్ మరింత ఆదరణ చూరగొనటంలో ఎటువంటి సందేహం లేదు. కుమారి – 21 సినిమాతో హెబ్బా కుర్రోళ్ళ గుండెలను కొల్లగొట్టిన విషయం తెలిసినదే.

ప్రస్తుతానికి హెబ్బా పటేల్ చేతిలో కూడా ఎలాంటి సినిమాలు లేవు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న హెబ్బా పటేల్ కు రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ లో వారం వారం గడిచే కొద్ది ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని ఆసక్తి షో నిర్వాహకులు రేకెత్తిస్తున్నారు. నాని కూడా తన ఒకటి, రెండు ఎపిసోడ్స్ తరువాత తన టాలెంట్ తో శనివారం, ఆదివారం ప్రేక్షకులను బిగ్ బాస్ షో ముందు కూర్చునేలా తన మాటలతో కట్టిపడేస్తున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ లో దీప్తి, భాను, కామన్ మ్యాన్ గణేష్ సెలెక్ట్ అయ్యారు. గణేష్ తనకు తానుగా ఎలిమినేషన్ లోకి వెళ్లడం కొంత ఆసక్తిగా ఉంది. ప్రేక్షకులు కూడా కామన్ మ్యాన్ ఒకరు బిగ్ బాస్ షోలో ఉండాలని ఓటింగులో గణేష్ ను ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ అయ్యేదెవరో కొంత ఆసక్తి నెలకొంది.

Tags : Big Boss2, Actor Nani, Hebbah Patel, Big Boss 2 Elimination, Wild Card