Tuesday, October 8, 2024

Bigg Boss 8: వెనక్కి తగ్గని అభయ్.. నిన్నేం తిట్టానో చెప్పు బిగ్ బాస్.. ఇప్పుడే వెళ్లిపోతా

- Advertisement -


Bigg Boss 8: అభయ్ నవీన్ తనను అవమానించడంతో బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తిట్టినప్పుడు శ్రద్ధగా విని.. ఆపై ఎంట్రీ ఇచ్చి.. చీఫ్ గా అభయ్ ను పీకి పడేసి.. తన క్లాన్ లోని వారిని కూడా చీఫ్ లుగా చేశారు బిగ్ బాస్. హౌస్ లో ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అనేంతలా వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో అభయ్ నవీన్ హర్ట్ అయ్యాడు.. బిగ్ బాస్ నేనేం తిట్టానో చెప్పు.. శనివారం నాగార్జున సార్ వచ్చి చెప్పే వరకు ఆగలేను.. ఇప్పుడే తెలుసుకోవాలి’ అని అభయ్ నవీన్ చెప్పాడు. బిగ్ బాస్ గత ఎపిసోడ్‌లో అభయ్ నవీన్ ఏమన్నాడంటే.. ‘‘నాకు నోరు ఆగదు.. ఏదైనా మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చింది ఊరికే ఉండడానికి కాదు. మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతాం. అది బిగ్ బాస్ కు నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు అనవసరం. ఒక వేళ నచ్చకపోతే నాకు చెప్పాల్సింది. బిగ్ బాస్ గురించి అలా మాట్లాడడం తప్పు అని నాకు చెప్తే అనకుండా ఉండే వాడిని. నేను గేమ్ లో ఓడిపోయినందుకు నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు. అందుకే ప్రశ్నించాను. నచ్చకపోతే చెప్పకుండా ఎలా ఉంటాం. బరాబర్ అడుగుతాం. నేను అసభ్యకరమైన పదజాలం వాడానని బిగ్ బాస్ నన్ను చీఫ్ గా తొలగించారు.. అది ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది.

నేను టంగ్ స్లిప్ అయ్యాను అని బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే వినాలని ఉంది. మణికంఠ కోసమే అని బిగ్ బాస్ చెబుతుంటే.. అతనేం నా కోసం ఆడడానికి రాలేదు కదా.. అతని కోసం అతడు ఆడాడు. నాకు సంబంధం లేదు. వాడి లైఫ్ అంతా పక్కన పెట్టి ఇక్కడి వచ్చాడు. మరి వాడెందుకు నా వల్ల కష్టాలు పడాలి. ఆదిత్య ఓం పట్ల అభయ్ నవీన్ చాలా బాధపడ్డాడు. ఆదిత్య ఓం సర్ది చెప్పేందుకు .. అది కాదు అభయ్.. ఇది క్లాన్ మొత్తానికి ఇచ్చిన గేమ్ కదా.. క్లాన్ ను నువ్వే చీఫ్ కదా.. సర్లే శనివారం నాడు నాగార్జున గారు చెప్తారు కదా’ అని ఆదిత్య సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా.. అభయ్ వినిపించుకోలేదు.

నేను క్లాన్ కు చీఫ్ గా చేయలేదని నన్ను తీసేశాడు. నేను తప్పు చేశానని చీఫ్ గా తీసేసినప్పుడు. ముందు నన్ను కన్షెషన్ రూంకి పిలిచి మాట్లాడాలి కదా. కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ నీకు ఒక సారి వార్నింగ్ ఇచ్చా. అయినా నువ్వు వినలేదని అంటాడేంటి బిగ్ బాస్. నేను తప్పుగా మాట్టాడి ఉంటే నాకు ముందుకు వార్నింగ్ ఇవ్వాలి కాదా.. స్మోకింగ్ జోన్ దగ్గర ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. మారి నాకెందుకు ఇవ్వలేదు. వార్నింగ్ లేకుండా నన్ను బ్లేమ్ చేస్తే కరెక్ట్ కాదు. ఇదే నేను ప్రశ్నిస్తున్నా. ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నా.. బ్లేమ్ చేస్తే నాకు నచ్చదు. అన్ని కెమెరాల్లోనూ అడుగుతా అన్నారు అభయ్.

ఇంతలో మణికంఠ అక్కడకు రాగా… ‘రేయ్ నువ్వు వెళ్లి కెమెరాలకి చెప్పుకో.. అభయ్ వల్ల నాకు ఇబ్బంది పడాలని అనుకోవడం లేదు. నేను వ్యక్తిగతంగా గెలిచాను.. అభయ్ ఏం మాట్లాడినా నాకు తెలియదు. ఆయనను కన్షెషన్ రూంకు పిలిచి అడగమని చెప్పు. నేను తప్పు చేయడం వల్ల నా క్లాన్ లో మిగిలిన ఐదుగురికి చీఫ్ కావడానికి అర్హత లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ నాది తప్పు అయితే.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కూడా రెడీ. నాకు ఇలాంటివి నచ్చదు. ఏం జరిగిందో తెలియాలి. ఒక్కడి వల్ల ఐదుగురు చీఫ్ కాకుండా పోవడానికి.. అంత తప్పు నేనేం చేశానో తెలియాలి. అసభ్యపదజాలంతో నేను బిగ్ బాస్‌ని నేను తిట్టానంటే.. కలర్స్ టాస్క్ అప్పుడు కూడా బిగ్ బాస్‌ని కుక్కతిట్లు తిట్టానన్నాడు. ఈ ఒక్కరోజు ఆగితే ఎలాగైనా అభయ్ నవీన్ వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే బిగ్ బాస్ ని తిట్టడం పెద్ద విషయం కాదు కానీ.. ఈ వారం అతని ఆట మరీ దారుణంగా ఉంది. అంతేకాదు తొలిసారిగా నామినేట్ అయినందున… శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున గెటౌట్ అనడం ఖాయమే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!